శిక్షణను ప్రారంభించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రవి
నరసరావుపేట: జిల్లాలోని పలు ప్రభుత్వ హాస్పిటళ్లు, హెల్త్ సెంటర్లలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు రక్తపరీక్షల నిర్వాహణకు మెలకువలను నేర్చుకొని మలేరియా నిర్ధారణ సక్రమంగా చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. సోమవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రవీంద్ర రత్నాకర్ ఆధ్వర్యంలో ప్రైమరీ, అర్బన్, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, హాస్పిటళ్లలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లకు వారం రోజులపాటు నిర్వహించే ఓరియంటేషన్ ట్రైనింగ్‌ను ప్రారంభించారు. ఈ శిక్షణను డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి ప్రారంభించారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రత్నాకర్ మాట్లాడుతూ వారం రోజులపాటు ఇచ్చే శిక్షణలో ల్యాబ్ టెక్నిషియన్లు పకడ్బందీగా తర్ఫీదు పొంది ల్యాబ్‌లను సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment