కదంతొక్కిన న్యాయవాదులు
గుంటూరువెస్ట్: పొన్నూరు పోలీసులు దళిత న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం కలెక్టరేట్‌లో నిరసన వ్యక్తం చేశారు. సుమారు వందకుపైగా న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ న్యాయవాది శాంతకుమార్, కేకేలు మాట్లాడుతూ గత నెల 25న పొన్నూరులో న్యాయవాది బి.ప్రకాశరావు తన స్నేహితులకు చికిత్స ఎందుకు చేయడంలేదని వైద్యులను ప్రశ్నించినందుకు సీఐ రవికిరణ్, ఎస్‌ఐ రాజకుమార్, కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్లో దారుణంగా కొట్టారన్నారు. ప్రకాశరావుకు తీవ్ర గాయాలయ్యాయని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల క్షేమం కోసం పనిచేయాల్సిన పోలీసులు రక్తం కారేలా ఓ న్యాయవాదిని కొట్టడం అన్యాయమన్నారు. ఇలా అయితే ప్రజలకు పోలీసులపై గౌరవం ఏముంటుందని ప్రశ్నించారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు వేములు ప్రసాద్, దేవరకొండ రోశయ్య, పలువురు న్యాయవాదులు పొల్గొన్నారు.
న్యాయవాదిపై పొన్నూరు పోలీసుల దాడికి ఖండన కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం
Comments
Please login to add a commentAdd a comment