గుంటూరురూరల్: గుంటూరు సౌత్ డీఎస్పీగా జి.భానోదయ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని సౌత్ డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. భానోదయ 2022 బ్యాచ్‌లో నియమితులయ్యారు. రాజమండ్రి ఈస్ట్ జోన్‌లో ప్రొబేషనరీ డీఎస్పీగా విధు లు నిర్వర్తించారు. అక్కడి నుంచి గుంటూరు సౌత్‌జోన్‌కు బదిలీపై వచ్చారు.
ముగ్గురిపై కత్తితో దాడి
చిట్టీల వివాదమే కారణం!
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): చిట్టీ వివాదం నేపథ్యంలో ముగ్గురిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన ఘటన సోమవారం జరిగింది. నగరంపాలెం పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన చల్లగొల్ల రమేష్ అదే ప్రాంతానికి చెందిన సింగయ్య ద్వారా రూ.లక్ష చిట్టీ వేశాడు. మూడు నెలలుగా రమేష్ డబ్బులు చెల్లించకపోవడంతో నిర్వాహకులు సింగయ్యకు ఫోన్‌చేసి రమేష్ డబ్బులు చెల్లించలేదని, మధ్యవర్తిగా ఉన్న నువ్వు చెల్లించాలని చెప్పారు. దీంతో ఆగ్రహంతో సింగయ్య రమేష్‌కు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో తిట్టాడు. రమేష్ సోమవారం తన కుమారుడు యశ్వంత్, బావమరిది నాయుడును తీసుకుని సింగయ్య ఇంటికి వెళ్లి చిట్టీ డబ్బులు చెల్లించాడు. డబ్బు కట్టడంలో కొంత ఆలస్యమైనంతమాత్రాన ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం సరికాదని చెప్పారు. ఈ నేపథ్యంలో సింగయ్యకు, రమేష్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో సింగయ్య కుమారుడు మల్లికార్జునరావు ఇంట్లో ఉన్న కత్తితో రమేష్ కుమారుడు యశ్వంత్, నాయుడులపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన రమేష్ తలపై దాడి చేశాడు. సమాచారం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సింగయ్య, మల్లికార్జునరావులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గాయాలపాలైన రమేష్, యశ్వంత్, నాయుడులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ సమగ్రాస్పత్రికి తరలించారు. పోలీసులు ఇరువు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం
ప్రత్తిపాడు: చర్చి స్థలం ఆక్రమించి నిర్మిస్తున్న గోకులం షెడ్డు నిర్మాణాన్ని నిలు పుదల చేయాలని అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నందుకు కొందరు గ్రామస్తులు తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుమందు తాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చెబుతూ, పురుగుమందును తాగుతూ తీసుకున్న సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ ఘటన ప్రత్తిపాడు మండలంలో జరిగింది.. సెల్ఫీ వీడియోలో బాధితుడు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. ప్రత్తిపాడు మండలం కొండేపాడుకు చెందిన ఓ వ్యక్తి గ్రామంలో గోకులం షెడ్డును నిర్మించుకుంటున్నాడు. ఆ స్థలంలో కొంత తన తాతలు దానంగా ఇచ్చిన చర్చి స్థలం ఉందని, గోకులం నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని గ్రామానికి చెందిన దాసరి కల్యాణ్ కొద్దిరోజులుగా గ్రామ, మండల స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నాడు. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు సమస్య ను పరిష్కరించడం లేదు. ఈ క్రమంలో ఆదివారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కల్యాణ్‌ను దుర్భాషలాడాడు. కల్యాణ్‌తోపాటు అతని బంధువులపై అక్రమ కేసులు పెట్టారు. పోలీసులు ఆ కేసులు పట్టుకుని తనను వేధిస్తున్నారని, చర్చి స్థలం కోసం పోరాడుతున్న తనకు జరిగిన అవమానం భరించలేక పురుగుమందు తాగి చనిపోతున్నట్టు వీడియోలో వివరించాడు. అనంతరం పురుగుమందు తాగేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment