ఫార్మా.డీ, బీ ఫార్మసీ కోర్సులకు ఉజ్వల భవిష్యత్
డాక్టర్ వై.లక్ష్మణస్వామి
బాపట్ల: ఫార్మా.డీ, బీ ఫార్మసీ కోర్సులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ వై.లక్ష్మణస్వామి పేర్కొన్నారు. బాపట్ల ఫార్మసీ కళాశాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ వై.లక్ష్మణస్వామి పాల్గొని మాట్లాడారు. ఫార్మా.డీ కోర్సు క్లినికల్ ఫార్మాసిస్టుగా, కమ్యూనిటీ ఫార్మాసిస్టుగా వైద్యసేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడతారని తెలిపారు. చక్కగా చదువుకుని ఉన్నతశ్రేణి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి.ఈ.గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ జి.నాగార్జున, డాక్టర్ ఎం రంగనాథరెడ్డి, డాక్టర్ టి.గోవర్ధన్‌రెడ్డి, ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పులనేని శ్రీనివాసరావు, సెక్రటరీ ఎం.నాగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ డి.వెంకయ్య చౌదరి, ట్రెజరర్ కోట వీరబ్రహ్మం, వైస్ ప్రెసిడెంట్‌లు వెంకట్రావు, చంద్రశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలపై
కమిషనర్ సానుకూల స్పందన
బాపట్ల: పంచాయతీరాజ్‌శాఖలోని ఉద్యోగుల సమస్యలపై ఆశాఖ కమిషనర్ ఎం.కృష్ణతేజ సానుకూలంగా స్పందించారని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పల్నాటి శ్రీరాములు పేర్కొన్నారు. కమిషనర్ ఎం.కృష్ణతేజను తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యల వినతిపత్రం అందించారు. కమిషనర్ ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కమిషనర్‌ను కలిసిన వారిలో అసోసియేషన్ నాయకులు పులిపాటి అమ్మయ్య కూడా ఉన్నారు.
యువ కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పల్లపోలు
చినగంజాం: యువ కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన పల్లపోలు ఆంజనేయ తేజా నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు అతనికి సోమవారం రాష్ట్ర యువ కాపునాడు అధ్యక్షుడు పూల చైతన్యమోహన్ నుంచి ఉత్తర్వులు అందాయి. తేజా నాయుడు కళాశాల చదివే రోజులలో విద్యార్థుల యూనియన్‌లో ఉత్సాహంగా పాల్గొని పలు సమస్యలపై పోరాడాడు. కళల పట్ల, కళాకారుల పట్ల అతనికి ఆసక్తి ఎక్కువ. తేజా నాయుడును గ్రామ పెద్దలు అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment