డీఆర్‌డీఏ ఏరియా కోఆర్డినేటర్ రమాదేవి నిర్బంధం
నగరం: గ్రామ సమైఖ్య నిధులు స్వాహా చేశారని డీఆర్‌డీఏ ఏరియా కోఆర్డినేటర్ రమాదేవి, సీసీ నాగకుమారి, యానిమేటర్‌లను డ్వాక్రా మహిళలు నిర్చంధించిన సంఘటన సోమవారం నగరం గౌడపాలెంలోని రామమందిరం వద్ద జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రామమందిరంలో డ్వాక్రా మహిళల సమావేశం నిర్వహించారు. సమావేశంలో డ్వాక్రా మహిళలు గ్రామ సమైఖ్య నిధుల వివరాల గూర్చి డీఆర్‌డీఏ అధికారులను నిలదీశారు. అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడం, సమాచారం కూడా ఇవ్వకపోవడంతో డ్వాక్రా మహిళలు అందోళళన చేశారు. ఈ నేపథ్యంలోనే డ్వాక్రా మహిళలకు, అధికారులకు వాగ్వావాదం జరిగింది. డీఆర్‌డీఏ ఏరియా కోఆర్డినేటర్ రమాదేవి, సీసీ నాగకుమారి, యానిమేటర్‌లు ఫణి రాజకుమారిలను రామమందిరంలో ఉంచి గేట్లకు గడియ పెట్టి నిర్బంధించారు. గ్రామ సమైఖ్య నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వారిని విడిచిపెట్టారు.
గ్రామ సమైఖ్య నిధులు దుర్వినియోగం చేశారని మహిళలు ఆందోళన నిధుల దుర్వినియోగంపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment