పాడైన పైరును పరిశీలించిన శాస్త్రవేత్తలు
జే.పంగులూరు: ఓ ప్రైవేటు కంపెనీ కలుపు మందు వినియోగించగా దెబ్బతిన్న పంటను శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. ముప్పవరం గ్రామ పరిసర ప్రాంత రైతులు అగస్త్య కంపెనీ కలుపుమందు పిచికారీ చేయగా మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిన్న విషయం విదితమే. పంట దెబ్బతిన్న పొలాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. సంబంధిత రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొలాల్లో కలుపు మందు వాడి ఎదుగుదల లేని మొక్కలు, మోము ఎండిన మొక్కలను పరిశీలించి నమూనాలను తీసుకెళ్లారు. నష్టానికి గల కారణాలు మొక్కలను పరిశీలించి నివేదిక పంపుతామని గుంటూరు లాం ఫారం శాస్త్రవేత్త డాక్టర్ ప్రతిభశ్రీ తెలిపారు. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ కలుపు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని, కలుపు మందు పిచికారీ చేసే సమయంలో తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. మందు మోతాదు, నీటి పరిమాణం తీసుకొని సూచించిన మేరకు పిచికారీ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ (ఆగ్రానమి) డాక్టర్ డయానా, గ్రేజ్ సైంటీస్ట్ (ఎంటమాలజీ), అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్టూరు కేవీ శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment