చిన్నారుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
తాడేపల్లిరూరల్: బాలల హక్కులను పరిరక్షణే ధ్యేయంగా వ్యవస్థలన్నీ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు రాజేంద్రనాథ్, పద్మావతి సూచించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని వీవర్స్ కాలనీలోని మున్సిపల్ హైస్కూల్‌ను సోమవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ జీవితంలో ప్రతిఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా కృషిచేయాలన్నారు. సోషల్‌మీడియాను పరిమితంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఆహారం వండే విధానం, శుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ప్రభుత్వం పిల్లల హక్కుల పరిరక్షణకు ఉన్న చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎన్. బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యస్. శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment