ఏఎన్‌యూ డిస్టెన్స్ డిగ్రీ కోర్సుల ఫలితాలు
ఏఎన్‌యూ(గుంటూరుఈస్ట్): ఆచార్య నాగార్జు న విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గతేడాది అక్టోబర్/నవంబర్ నెల ల్లో నిర్వహించిన పలు డిగ్రీ కోర్సుల ఫలితాల ను విడుదల చేసినట్లు దూరవిద్య పరీక్షల డెప్యూటీ రిజిస్ట్రార్ సయీద్ జైన్ లాబ్దిన్ సోమ వారం తెలిపారు. ఫలితాల సీడీని యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు విడుదల చేశారు. వీసీ కె.గంగాధరరావు మాట్లాడుతూ బీఏ 4వ, ఐదో సెమిస్టర్, బీకాం (జనరల్, కంప్యూటర్ అప్లికేషన్‌న్‌స), 4, 5 సెమిస్టర్లు, బీబీఏ కోర్సుల 4,5 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు వెల్లడించారు. జైన్ లాబ్దిన్ మాట్లాడుతూ రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 3లోగా ఒక్కొక్క పేపర్‌కు రూ.770 చెల్లించి, దరఖాస్తులను దూరవిద్య కేంద్రం పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందేలా పంపాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment