మద్యం అమ్మకాలలో కొత్త పోకడలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే మన ఇంటికే టిఫిన్, భోజనం పార్సిల్ రావడం చూశాం..జిల్లాలో మద్యం దుకాణదారులు కూడా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఆటోలు, బైకులపై మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. అంతేగాక తిరునాళ్లు, జాతరలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం అమ్ముతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన కోడి పందేల బరుల వద్ద దుకాణాలు ఏర్పాటుచేసి మద్యం విచ్చలవిడిగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇప్పటికే ఒక్కొక్క గ్రామంలో నాలుగు నుంచి 10 వరకు బెల్టు షాపులు ఏర్పాటుచేసి మద్యం ఏరులై పారిస్తున్నారు. అయినా ఎకై ్సజ్ అధికారులుకానీ, సివిల్ పోలీసులుకానీ వాటివైపు కన్నెత్తి చూడడం లేదు. కూటమి నేతలు ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్నారు.
బాబును పట్టించుకోని తమ్ముళ్లు
బెల్టు షాపు ఏర్పాటు చేస్తే సహించేది లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిస్తున్నా ఆయనను తెలుగు తమ్ముళ్ల ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా గ్రామానికి మూడు నుంచి నాలుగు బెల్టు షాపులు ఏర్పాటుచేసి మద్యం అమ్ముతున్నారు. యద్దనపూడి మండలం పూనూరులో ఏకంగా 16 బెల్టుషాపులు ఏర్పాటు చేశారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. జేబులు నింపుకోవడమే లక్ష్యంగా మద్యం ఏరులై పారిస్తున్నారు.
బరుల వద్దే మొబైల్ మద్యం షాపులు
సంక్రాంతి పండుగ సందర్భంగా పచ్చ నేతలు జిల్లా వ్యాప్తంగా జరిగిన కోడి పందేలు, ఇతర జూద క్రీడలు నిర్వహించారు. బరుల వద్ద మొబైల్ మద్యం దుకాణాలు నెలకొల్పడం చర్చనీయాంశంగా మారింది. వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లో నెలకొల్పిన పెద్ద బరుల వద్ద మొబైల్ మద్యం దుకాణాలతోపాటు పదుల సంఖ్యలో బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. సంక్రాంతి పండుగ మూడురోజుల్లో అదనంగా రూ.కోట్లలో మద్యం వ్యాపారం జరిగినట్లు సమాచారం. మొబైల్ మద్యం షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు సాగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే ఊరూరా బెల్టు షాపులు కొన్ని గ్రామాల్లో 3 నుంచి 4 దుకాణాలు యద్ధనపూడి మండలం పూనూరులో 16 షాపులు జిల్లా వ్యాప్తంగా రెండు వేలకుపైగానే.. తాజాగా తిరునాళ్లు, జాతరల వద్ద తాత్కాలిక దుకాణాల ఏర్పాటు పర్చూరు, రేపల్లె, చీరాల, వేమూరు నియోజకవర్గాల్లో డోర్ డెలివరీ మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ శాఖ
మామూళ్ల మత్తులో అధికారులు
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2,500లకుపైగా బెల్టుషాపులు ఏర్పాటుచేశారు. ఎకై ్సజ్ అధికారులు, కొందరు సివిల్ పోలీసు అధికారులు మొబైల్ మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రత్యేక అనుమతులిచ్చారు. వీరి నుంచి పెద్ద ఎత్తున్న మామూళ్లు పుచ్చుకున్నట్లు కొందరు మద్యం వ్యాపారులు ఆరోపిస్తున్నారు. జనవరితో సంక్రాంతి హడావుడి ముగిసినా ఫిబ్రవరిలో వేమూరు, రేపల్లె, బాపట్లతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తిరునాళ్లు, జాతర్లు, శివరాత్రి పండుగలున్నాయి. దీంతో ఎక్కడికక్కడ మొబైల్ మద్యం షాపులు, వాటికి అనుబంధంగా బెల్టు దుకాణాలు ఏర్పాటుచేసేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి మొబైల్ మద్యం దుకాణాలను అరికట్టి ఇంటింటికి మద్యం సరఫరా కార్యక్రమానికి అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment