సుందరం.. సుమనోహరం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
సెమినార్‌లో పాల్గొనే వారు దరఖాస్తు చేసుకోవాలి
కొత్తగూడెంఅర్బన్ : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ ఉపాధ్యాయులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సెమినార్‌లో పాల్గొనే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.చలపతిరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెమినార్ ప్రధానాంశం సైన్స్ ఇన్ ఆవర్ వరల్డ్‌పై ఉంటుందని, సైన్స్ ఉపాధ్యాయులు, టీచర్ ఎడ్యుకేటర్లు కూడా పాల్గొనవచ్చని తెలిపారు. ఉప అంశాలుగా సైన్స్ బోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎకోలాజికల్ బ్యాలెన్స్, ఫుడ్ ఎడ్యుకేషన్ – రోల్ ఆఫ్ టీచర్స్, సైన్స్ ఎడ్యుకేషన్ స్థాయి పెంపునకు అనుసరించాల్సిన శాసీ్త్రయ విధానాలు, రసాయనిక శాస్త్రం–అభ్యాసనపై సెమినార్ పత్రాలు రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అడవుల సంరక్షణలో
నిర్లక్ష్యం వద్దు
చర్ల: అడవుల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దని సీసీఎఫ్ డి.భీమానాయక్ అన్నారు. గురువారం ఆయన చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పర్యటించారు. దుమ్ముగూడెం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని, గోవిందాపురం – బక్కచింతపాడు అటవీ ప్రాంతం మీదుగా రహదారి నిర్మాణానికి సంబంధించి పరిశీలించారు. ఆ తర్వాత చర్ల అటవీశాఖ కార్యాలయంలో నర్సరీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే వేసవిలో అడవులు అగ్నికి ఆహుతి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పట్టాలిచ్చిన పోడు భూములు మినహా మరెక్కడా పోడు కొట్టకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడైనా పోడు కొట్టినట్టు సమాచారం వస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్య తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్, ఎఫ్‌డీఓ సుజాత, రేంజ్ ఆఫీసర్లు ద్వాలియా, కమల తదితరులు పాల్గొన్నారు.
వైద్యుల పర్యవేక్షణలోనే ప్రసవాలు జరగాలి
కొత్తగూడెంరూరల్: ప్రభుత్వాత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, స్టాఫ్‌నర్సుల పర్యవేక్షణలో ప్రసవాలు జరరగాలని డీఎంహెచ్‌ఓ ఎల్.భాస్కర్‌నాయక్ అన్నారు. ఐడిఓసీలో గురువారం వారసత్వ, జన్యుపరమైన రుగ్మతలపై వైద్యాధికారులు, స్టాఫ్‌నర్సులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు నెలల్లోపు పిల్లల్లో వచ్చే జన్యుపరమైన రుగ్మతలకు కారణాలు తెలుసుకునేందుకు ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయలక్ష్మి, డాక్టర్లు రాధామోహన్, బాలాజీ, చైతన్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment