హోరాహోరీగా క్రీడాపోటీలు
పాల్వంచరూరల్: రాష్ట్రస్థాయి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలల క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మండలంలోని లక్ష్మీదేవిపల్లి గురుకులంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో శుక్రవారం పలు జట్లు ఫైనల్స్‌కు చేరాయి. అండర్–17 విభాగంలో వాలీబాల్ పోటీల్లో జోన్–2, జోన్–7 జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. అండర్–19 విభాగం కబడ్డీ పోటీల్లో జోన్–7, జోన్–4 జట్లు, అండర్–17 విభాగం ఖోఖో పోటీల్లో జోన్–1, జోన్–4 జట్లు, అండర్ 19 విభాగంలో జోన్–1, జోన్–3 జట్లు, హ్యాండ్‌బాల్ పోటీల్లో జోన్–1, జోన్–5 జట్లు, అండర్–19 విభాగంలో జోన్–4, జోన్–6 జట్లు, బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో జోన్–1, జోన్–5 జట్లు, టెన్నికాయిట్ పోటీల్లో జోన్–4, జోన్–3 జట్లు ఫైనల్స్‌కు చేరినట్లు నిర్వాహకులు తెలిపారు.
విజేతలు
క్యారమ్స్ పోటీల్లో జోన్–2 జట్టు ప్రథమ, టెన్నికాయిట్‌లో జోన్–3 ప్రథమ, జోన్–4 ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. అండర్–14 విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో ఎ.విషాల్ ప్రథమ, ఎం.నితిన్ ద్వితీయ, పి.రాకేష్ తృతీయ, లాంగ్‌జంప్ పోటీల్లో సీహెచ్.నితిన్ ప్రథమ, టి.చరణ్ ద్వితీయ, ఎం ప్రవీణ్ తృతీయ, షాట్‌పుట్‌లో శివరాజ్ ప్రథమ, కె.ఆనంద్ ద్వితీయ, కె.సంకేత్ తృతీయ స్థానాలు సాధించారు.
అండర్–17 విభాగంలో
లాంగ్ జంప్‌లో కె.ప్రవీణ్ ప్రథమ, కె.ఆనంద్ ద్వితీయ, జి.అనిల్ తృతీయ, 5 వేల మీటర్ల పరుగు పందెంలో ఎ.భద్రూనాయక్ ప్రథమ, జె.గౌతమ్ ద్వితీయ, వి.బన్ని తృతీయ స్థానాల్లో నిలిచారు.
అండర్–19 విభాగంలో
షాట్‌పుట్‌లో పి.అరవింద్ ప్రథమ, సిద్ధార్థ ద్వితీయ, ఎ.గణేష్ తృతీయ, లాంగ్ జంప్‌లో ఎ.గణేష్ ప్రథమ, కె.ఉదయ్‌కిరణ్ ద్వితీయ, డి.గణేష్ తృతీయ, 5 వేల మీటర్ల పరుగు పందెంలో జి.శివకుమార్ ప్రథమ, పి.గోపిచంద్ ద్వితీయ, సి.సునీల్ తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు గురుకుల విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రటరీ సక్రునాయక్, మల్టీజోనల్ అధికారి అలివేలు, స్పోర్ట్స్‌మీట్ ఇన్‌చార్జి సట్ల శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.శ్రీనివాస్ బహుమతులను ప్రదానం చేశారు.
రెండో రోజూ ఉత్సాహంగా సాగిన
గురుకులాల రాష్ట్రస్థాయి పోటీలు
Comments
Please login to add a commentAdd a comment