ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన
చండ్రుగొండ: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం తేమశాతాన్ని ఆయన పరిశీలించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని ధాన్యం కాటాలు త్వరితగతిన చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. కాగా, కొనుగోలు కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ నాయకులు భోజ్యానాయక్, కీసరి కిరణ్‌రెడ్డి అదనపు కలెక్టర్‌ను కోరారు. గోదాంల ప్రాంగణంలో ఉన్న జామాయిల్ ఇతర చెట్లను తొలగిస్తే రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. అనంతరం తిప్పనపల్లిలో జరగుతున్న ఇందరమ్మ ఇళ్ల సర్వేను అదనపు కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ సంధ్యారాణి, ఆర్‌ఐ అక్బర్, కాంగ్రెస్ నాయకులు ఫజల్‌బీ, సీహెచ్ లక్ష్మణ్‌రావు, దారం గోవిందరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment