ప్రతి ఇంట్లో డ్వాక్రా గ్రూపు సభ్యురాలు ఉండాలి
చుంచుపల్లి: జిల్లాలో ప్రతి ఇంట్లో ఓ మహిళ తప్పనిసరిగా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలై ఉండాలని డీఆర్‌డీఓ ఎం.విద్యాచందన అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సెర్ప్ కార్యక్రమాలపై ఏపీఎంలు, సీసీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతి మహిళా సంఘం అభివృద్ధి చెందేలా వ్యాపార అంశాలపై చైతన్యం కల్పించాలన్నారు. ఏపీఎంలు, సీసీలు వారి నెలవారి లక్ష్యాలను 100 శాతం సాధించాలని ఆదేశించారు. అదనపు డీఆర్‌డీఓ నీలేష్, శ్రీనిధి రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ , డీపీఎంలు, ఏపీఎంలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఓ విద్యా చందన
Comments
Please login to add a commentAdd a comment