మహిళా ఉద్యోగులకు రెస్క్యూపై అవగాహన
సింగరేణి(కొత్తగూడెం): భూగర్భ గనుల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు రెస్క్యూపై అవగాహన కల్పించేందుకు యాజమాన్యం కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భూగర్భ గనుల్లో పనిచేసే మహిళల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంస్థ ఉన్నతాధికారులు వెల్లడించారు. గనుల్లో రెస్క్యూ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలలో పాల్గొనేందుకు అవరసమైన అర్హతలను తెలిపారు. మైన్స్ రూల్స్ 1985 ప్రకారం 21 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి ఉండాలని, విద్యార్హత కనీసం ఎస్సెస్సీ ఉండాలని, భూగర్భ గనుల్లో కనీస అనుభవం, జ్ఞానం ఉండాలని పేర్కొన్నారు. ఈనెల 20న ఆర్జీ–2లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్‌లో, 22న, మందమర్రి ఏరియాలోని ఆర్‌ఆర్‌ఆర్‌టీలో, 24న భూపాలపల్లి ఏరియాలోని ఆర్‌ఆర్‌ఆర్‌టీలో, 29న, కొత్తగూడెంలోని ఆర్‌ఆర్‌ఆర్‌టీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment