కొనసాగుతున్న పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్ : సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మండల పరిధిలోని కిన్నెరసానిలో పర్యాటకుల సందడి కొనసాగుతూనే ఉంది. జిల్లా నలుమూలలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్నారు. సోమవారం 921 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.31,610 ఆదాయం లభించగా, 620 మంది బోటు షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్‌కు రూ.31,460 ఆదాయం సమకూరిందని నిర్వాహకులు తెలిపారు. కాగా, మంచిర్యాల ఎఫ్‌డీఓ వేణుబాబు సోమవారం కిన్నెరసానిని సందర్శించారు. ఈ సందర్భంగా డీర్‌పార్కులోని జింకలను, జలాశయాన్ని వీక్షించారు. ఆయన వెంట ఎఫ్‌ఎస్‌ఓ కిషన్, ఎఫ్‌బీఓ రాములు తదితరులు ఉన్నారు.
కిన్నెరసానిలో ఒకరోజు ఆదాయం రూ.63,070
Comments
Please login to add a commentAdd a comment