జీవితంలో గొప్ప సక్సెస్ సాధించిన వారిలో చాలామంది కష్టాల సంద్రాన్ని దాటుకుంటూ వచ్చినవారే.. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు ఆర్‌ఎమ్‌జెడ్ (RMZ) గ్రూప్ చైర్మన్ 'అర్జున్ మెండా' (Arjun Menda). స్కాలర్షిప్ సాయంతో చదువుకుని ఈ రోజు వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన ఈయన సక్సెస్ గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అర్జున్ మెండా, ఈ పేరు బహుశా చాలా మందికి పరిచయం లేకపోయినప్పటికీ.. 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 జాబితాలో ఒకరుగా నిలిచిన తరువాత దేశంలో ఈయన పేరు మారుమ్రోగిపోతోంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారుల జాబితాలో మూడవ వ్యక్తిగా నిలిచిన ఈయన ఆస్తుల విలువ ఏకంగా రూ.37,000 కోట్లు.
స్కాలర్షిప్ సాయంతోనే డిగ్రీ పూర్తి
ప్రస్తుతం పాకిస్థాన్‌లో భాగమైన సింధ్‌లోని షికార్‌పూర్‌లో 1933లో అర్జున్ మెండా జన్మించారు. భారత్, పాకిస్తాన్ విభజన జరిగిన సమయంలో మెండా కుటుంబం మొత్తం ఆస్తులను కోల్పోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఇండియాలోనే స్థిరపడ్డారు. కుటుంబ పరిస్థితి కష్టంగా ఉన్న రోజుల్లో ఎంతో కస్టపడి స్కాలర్షిప్ సాయంతోనే ఐఐటీ ఖరగ్‌పూర్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
చదువు పూర్తయిన తరువాత మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్‌లో ఇండస్ట్రియల్ ఇంజనీర్‌గా తన ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ తరువాత 1967లో గాబ్రియేల్ ఇండియా లిమిటెడ్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశారు. 1980 నాటికి తన జీవితాన్ని మార్చేసిన రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోకి అడుగుపెట్టారు.
RMZ కార్ప్..
2002లో అర్జున్ మెండా RMZ కార్ప్‌ని స్థాపించాడు. ప్రస్తుతం ఆ వ్యాపారాన్ని అతని ఇద్దరు కుమారులు, రాజ్ మెండా, మనోజ్ మెండా నిర్వహిస్తున్నారు. కంపెనీ ప్రారంభమైన తరువాత హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై వంటి ప్రముఖ నగరాల్లో అనేక సాఫ్ట్‌వేర్ సంస్థలకు అధునాతన భవనాలు నిర్మించి, కార్పొరేట్ కార్యాలయాలను నిర్మించే అగ్రగామిగా ప్రసిద్ధి చెందింది.
ఇదీ చదవండి: ఆర్‌బీఐ గవర్నర్‌గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే?
అర్జున్ మెండా చదువుకునే రోజుల్లో తాను పడ్డ కష్టాలను దృష్టిలో 1990లో మెండా ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా మెండా ప్రతి ఏటా వందలమంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తూ వారి అభివృద్ధికి దోహదపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment