ఎయిరిండియాను హస్తగతం చేసుకున్న తరువాత టాటా గ్రూప్స్ జోరుమీదుంది. ఇప్పటికే డిజిటల్ ఎకానమీలో పాతుకుపోయినా... దిగ్గజ కంపెనీలకు ధీటుగా టాటా గ్రూప్స్ త్వరలోనే యాప్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అటూ షాపింగ్‌తో పాటుగా...చెల్లింపుల కోసం యూపీఐ యాప్‌ను టాటా గ్రూప్ త్వరలోనే లాంచ్ చేయనుంది.
డిజిటల్ ఎకానమీలోకి...!
డిజిటల్ ఎకానమీలోకి అడుగుపెట్టేందుకు టాటా గ్రూప్స్ సిద్దమైంది.అమెజాన్, జియో లాంటి దిగ్గజ సంస్థలకు చెక్ పెట్టేందుకు టాటా గ్రూప్స్ ప్రణాళికలను రచిస్తోంది. అందులో భాగంగా టాటా నీయూ(Neu) సూపర్ యాప్‌ను ఏప్రిల్ 7, గురువారం రోజున లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ సహాయంతో కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను,భారీ బెనిఫిట్స్‌ను, టాటా గ్రూప్స్ అందించనుంది.
అంతేకాకుండా ఈ యాప్‌తో చెల్లింపులను చేస్తూ.. వన్ స్టాప్ షాపింగ్ అనుభూతిని టాటా నీయూ కల్పించనుంది. ఈ యాప్‌లో షాపింగ్, ఫ్లైట్, హోటల్ బుకింగ్ వంటి సదుపాయాలతో పాటు స్టోర్‌లలో కొనుగోలు చేసిన వస్తువులు, యుటిలిటీ బిల్లులకు చెల్లించే చెల్లింపు సౌకర్యాన్ని టాటా నీయూ అందించనుంది. వాటితో పాటుగా కస్టమర్లు జరిపే కొనుగోళ్లపై రివార్డులను కూడా ఇవ్వనుంది.
కొంతకాలంగా టాటా గ్రూప్స్ తన ఉద్యోగులతో `Neu` యాప్‌ను పరీక్షిస్తోంది. ఇక బిగ్ బాస్కెట్, 1mg కంపెనీలు అందించే లాయల్టీ పాయింట్స్ బదులుగా `NeuCoins`అందించనున్నట్లు సమాచారం. కిరాణా సామాగ్రి నుంచి గాడ్జెట్‌ల వరకు, Tata Neu యాప్‌లో కొనుగోలు చేయవచ్చును. వీటికి చెల్లింపులను జరిపేందుకు గూగుల్ పే, ఫోన్ పే తరహాలో ‘టాటా పే’ యూపీఐ యాప్‌ను టాటా గ్రూప్స్ అందుబాటులోకి తీసుకురానుంది.
చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్...ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం..!
Comments
Please login to add a commentAdd a comment