రామకుప్పం మండలంలోని వర్దికుప్పం వద్ద కాలువను పరిశీలిస్తున్న కలెక్టర్, నాయకులు
వి.కోట: చిత్తూరు జిల్లాలో ఈనెల 5న సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సీఎం పర్యటన ఏర్పాట్లపై సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 5న కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేపడుతున్నట్టు వెల్లడించారు. ఆయన వెంట జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎస్పీ రీశాంత్‌రెడ్డి, తహసీల్దార్ చిట్టిబాబు, ఎంపీడీఓ మహ్మద్‌రఫీ ఉన్నారు.
సభాస్థలి పరిశీలన
రామకుప్పం(శాంతిపురం): కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో సీఎం సభా స్థలిని కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ రిశాంత్‌రెడ్డి గురువారం క్షేత్ర పరిశీలన చేశారు. వర్దికుప్పం వద్ద హంద్రీ–నీవా కుప్పం కెనాల్‌లో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అక్కడ సీఎం సభకు అనువైన ప్రదేశం లేకపోవడంతో మిట్టపల్లి వద్ద కాలువ సమీపంలోని రామాలయ భూముల వద్ద సీఎం సభకు అనువుగా ఉన్నట్టు గుర్తించారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, ఎంపీ రెడ్డెప్ప, పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, రెస్కో చైర్మన్ సెంథిల్, వైస్ చైర్మన్ కోదండరెడ్డి, మండల కన్వీనర్లు బాబురెడ్డి, దండపాణి, జెడ్పీటీసీ సభ్యుడు నితిన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment