భోగి మంటల్లో కరెంట్ బిల్లులు
పలమనేరు: పెరిగిన కరెంట్ చార్జీలకు నిరసగా సీపీఎం నాయకులు కరెంట్ బిల్లులను సోమవారం బోగిమంటల్లో కాల్చేశారు. ఈ సందర్భంగా సీపీఎం, వ్యవసాయ కార్మికసంఘం, కేవీపీఎస్ నాయకులు మాట్లాడుతూ పాత వస్తువులను భోగిమంటల్లో కాల్చివేయడం మన ఆనవాయితీ అయినందున పెరిగిన కరెంట్ బిల్లులను భోగిమంటల్లో కాల్చేశామన్నారు. అదానికి మేలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై భారం మోపుతున్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా ఇదే పలమనేరు కొచ్చిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులను పెంచబోమని ప్రజల ముందు హామీ ఇచ్చారన్నారు. కానీ అధికారంలోకి రాగానే ముందుగా రూ.20 వేల కోట్ల కరెంటు భారాన్ని పేదలపై మోపారని దుయ్యబట్టారు. దీనికితోడు మరింత దోచుకోవడానికి స్మార్ట్‌మీటర్లను పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో స్మార్ట్‌మీటర్లు వద్దన్న ఇదే చంద్రబాబు ఇప్పుడెలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కూటమి అబద్దపు హామీల కారణంగా ప్రజలు సంక్రాంతిని సైతం జరుపుకోనేందుకు డబ్బులేక, ఆకాశాన్నింటిన ధరలతో పస్తులుండాల్సిన పరిస్థితికి తీసుకొచ్చిన కూటమి సర్కార్‌కు నూకలు చెల్లాయన్నారు. ఈ విషయం త్వరలో తేటతెల్లం అవుతుందన్నారు. ఓబుల్‌రాజు, ఈశ్వర్, భువనేశ్వరి, సుబ్రమణ్యం, సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం నాయకుల వినూత్న నిరసన
Comments
Please login to add a commentAdd a comment