రానున్న రోజులు మనవే
● మాజీ మంత్రి పెద్దిరెడ్డి
చౌడేపల్లె: రానున్న రోజులు మనవే...కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి చౌడేపల్లె మండల నేతలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం తిరుపతిలోని పెద్దిరెడ్డి నివాసంలో నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఐకమత్యంగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతోపాటు ప్రభుత్వవైఫల్యాలను ప్రజలకు తెలిపి, వారిలో చైతన్యం తేవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన దాడులు, అరాచకాలపై నాయకులతో పాటు ప్రజలు పోరాటం చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తూ అబద్దాలతో మాయ చేస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం ప్రజలే చెబుతారన్నారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, అందరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. అలాగే నూతనంగా నియమితులైన నియోజకవర్గ కార్యనిర్వాహక కార్యదర్శి పుదిపట్లకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీని కలిశారు. తమపై నమ్మకంతో పదవి కేటాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలు, దౌర్జన్యాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అంజిబాబు, వైస్ ఎంపీపీలు సుధాకర్‌రెడ్డి, నరసింహులు యాదవ్, సర్పంచుల సంఘ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పద్మనాభరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ రవిచంద్రారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment