యాదమరి (కాణిపాకం): మూడు రోజులుగా ఫూటుగా మద్యం తాగి తమిళనాడు వా సి మృతి చెందిన ఘటన సోమవారం యాదమరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం సేలం నగరానికి చెందిన చంద్రశేఖర్ (50) లారీ తీసుకెళ్లేందుకు జిల్లా వచ్చాడు. ఈ క్రమంలో యాదమరి మండల కేంద్రంలో లారీని పక్కన పెట్టి మూడు రోజుల నుంచి ఫూటుగా మద్యం సేవిస్తూ వచ్చా డు. దీంతో సొమ్మసిల్లి పడిపోయాడు. తీరా స్థానికులు అనుమానంతో అతన్ని కదిలించే ప్రయత్నం చేశారు. మృతి చెందినట్లు గుర్తించి లారీపై ఉన్న ఫోన్ నంబర్ చూసి స్థానికులు యజమానికి ఫోన్ చేశారు. ఆ యజమాని మృతదేహాన్ని వదిలిపెట్టి బండిని మాత్రం తీసుకెళ్లాడు. తీరా కుటుంబసభ్యులు, బంధువులకు విషయం తెలియడంతో మృతదేహాన్ని సేలంకు తీసుకెళ్లారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment