సాక్షి, తిరుపతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగం కమిటీలో చిత్తూరు, తిరుపతి జిల్లా వాసులకు చోటు కల్పిస్తూ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. మున్సిపల్ విభాగం ఉపాధ్యక్షుడిగా ఆర్ వెంకటేశులు, ప్రధాన కార్యదర్శిగా హరిణిరెడ్డి, కార్యదర్శిగా సాయిక్ మహ్మద్ జాఫర్, అఫ్సియల్ స్పోక్ పర్సన్‌గా ఖైజీర్‌ఖాన్, సంయుక్త కార్యదర్శులుగా ఎస్ డీ హఫీజ్, గుణశేఖర్‌ను నియమించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
అనుబంధ విభాగం..
రాష్ట్ర మున్సిపల్ విభాగంతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల అనుబంధ విభాగాల అధ్యక్షులను కూడా ప్రకటించింది. యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఉదయ్‌వంశీ(తిరుపతి), మహిళ విభాగం బొర్ర మాధవి(సత్యవేడు), రైతు విభాగం చంద్రమౌళిరెడ్డి(చంద్రగిరి), బీసీ విభాగం అధ్యక్షుడిగా సుబ్రమణ్యం అలియాస్ చిన్ని యాదవ్ (చంద్రగిరి), ఎస్సీ విభాగం తలారి రాజేంద్ర(తిరుపతి), ఎస్టీ విభాగం దశ సుబ్రమణ్యం(శ్రీకాళహస్తి), మైనారిటీ విభాగం ఎస్‌కే ఖాదర్ (పుంగనూరు), స్టూడెంట్ విభాగం అధ్యక్షుడిగా చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి (చంద్రగిరి) నియమితులయ్యారు. అలాగే క్రిష్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా రూబెన్ (పలమనేరు), పంచాయతీరాజ్ విభాగం కే మనోహర్(పూతలపట్టు), ఆర్‌టీఐ విభాగానికి కొత్తపల్లి విజయకుమార్(తిరుపతి), ఐటీ విభాగం నలి ప్రకాష్ రెడ్డి (పుంగనూరు), వలంటీర్ల విభాగం అధ్యక్షుడిగా కే ఈ ఢిల్లీబాబు( శ్రీకాళహస్తి) నియమితులయ్యారు. మున్సి పల్ విభాగం అధ్యక్షుడిగా ఎస్‌డీ హఫీజ్(కుప్పం), గ్రీవెన్స్ విభాగం మోహన్‌నాయక్ (కుప్పం), వాణిజ్య విభాగం బి.హేమసుందర్‌రెడ్డి(జీడీనెల్లూరు), వైద్య విభాగానికి జెల్లి వర వరప్రసాద్(తిరుపతి), ఇంటిలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిగా గిరిధర్‌రెడ్డి (చిత్తూ రు) నియమితులయ్యారు. అలాగే వైఎస్సార్‌టీయూసీకి సాయిక్ చంద్ బాషా(చిత్తూరు), వీవర్స్ విభాగం బాలక్రిష్ణన్ (నగరి), సాంస్కృతిక విభాగం కొండూరు శాస్త్రిరాజు (సత్యవేడు), దివ్యాంగుల విభాగం కోనాత్తం చంద్రశేఖర్ (పూతలపట్టు), సోషల్ మీడియా విభాగం వెల్లూరు రాకేష్(సత్యవేడు), పబ్లిసిటీ విభాగం సుబ్రమణ్యం(జీడీననెల్లూరు), బూత్ కమిటీ అధ్యక్షులుగా ఎన్ వెంకటేష్‌రెడ్డి (జీడీనెల్లూరు), అంగన్‌వాడీ విభాగం అధ్యక్షులుగా కొండవారి కుమారి(తిరుపతి)ని నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment