పెద్దాయన కృషి ఫలించింది!
సీమ..కరువుకు చిరునామా.. అలాంటి గడ్డపై పారిశ్రామిక ప్రగతితోనే అభివృద్ధి సాధ్యమని ఆ పెద్దాయన గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కసరత్తు చేశారు. దీంతో పలు కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుకు ముందడుగు వేశాయి. అయితే ప్రభుత్వం మారడంతో ఆ పనులకు కొంత భంగం కలిగింది. అయినా ఆ ప్రజాప్రతినిధి అలుపెరగని యోధుడిలా మొక్కవోని ధైర్యంతో తన లక్ష్యసాధనకు పోరాడి, సాధించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది. జర్మన్ దేశానికి చెందిన పెప్పర్ మోషన్ ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.
పుంగనూరు: కర్ణాటక సరిహద్దులోని పుంగనూరు నియోజకవర్గం నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అంతర్జాతీయస్థాయి గుర్తింపు కలిగిన జర్మన్ పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సులు, ట్రక్కులు కంపెనీ ఏర్పాటుకు కంపెనీకి అప్పట్లో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయి తే ప్రభుత్వం మార్పుతో ఆ పనులకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కృషి ఫలించింది. ఈ నేపథ్యంలో పెప్పర్ మోషన్ కంపెనీ ఏర్పాటు పనులకు ప్రభు త్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందని, త్వరలో పనులు ప్రా రంభిస్తున్నట్లు బస్సుల కంపెనీ ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
భారత్ గురించి...
జర్మన్ పెప్పర్ మోషన్ భారత ప్రముఖ ఎలక్ట్రికల్ మెబులిటీ సొల్యూషన్స్ ఓఈఎంలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పుంగనూరు సంస్థ తయారు చేయబోయే ఎలక్ట్రికల్ బస్సులు, ట్రక్కులతో పాటు బ్యాటరీలు మార్కెట్‌లో విస్తరించేందుకు ఆమోదముద్ర లభించింది. కంపెనీ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి లభించడం హర్షణీయం.
ఎంపీ, ఎమ్మెల్యేల కృషి ఫలితమే
రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి పుంగ నూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేశారు. పుంగనూరు మండలం ఆరడిగుంట నుంచి మేలుందొడ్డితోపాటు ఇటు పెద్దపంజాణి అటు కర్ణాటక సరిహద్దుల వరకు సుమారు పది వేల ఎకరాల భూమిని పారిశ్రామిక కారిడార్‌గా గుర్తించారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పైపుల ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చా రు. ఆ ఫ్యాక్టరీ ఏడాదిలో నిర్మాణం పూర్తి అయ్యి, గత వారం ఉత్పత్తులు ప్రారంభించింది. ఈ శుభ తరుణంలో జర్మన్ బస్సుల ఫ్యాక్టరీ కంపెనీ పనులు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ యాజమా న్యం ప్రకటించడంతో పుంగనూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జర్మన్ పెప్పర్ మోషన్ ఎలక్ట్రకల్ బస్సుల కంపెనీ రాకకు గ్రీన్ సిగ్నల్
త్వరలో కంపెనీ పనులు ప్రారంభం
ఫలించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ కృషి
హర్షం వ్యక్తం చేస్తున్న పుంగనూరు ప్రజలు
కంపెనీ ఏర్పాటు ఇలా..
జర్మన్ పెప్పర్ మోషన్ ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కు ల కంపెనీ మే లుందొడ్డి పరిసర ప్రాంతాల్లో సు మారు 800 ఎక రాల్లో సుమారు రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చే యనుంది. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించను న్నాయి. ఈ బస్సుల ఫ్యాక్టరీ నిర్మాణాలను మొదటిదశ ప్రాజెక్టు పూర్తి చేసి, 12 వేల బీఈవీ బస్సు లు, 18 వేల ఎలక్ట్రికల్ ట్రక్కులు, అసెంబ్లింగ్, 10 గిగావాట్ల బ్యాటరీప్యాక్ అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. రెండో దశ 2027 నాటికి 30 వేల బస్సులు, 18 వేల ట్రక్కులు తయారు చే యనున్నారు. మెరుగైన సాంకేతిక సామర్థ్యాల తో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్స్ సిస్టం ఎలక్ట్రికల్ వె హికల్స్‌ను మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. విద్యుత్ వాహన రంగంలో అత్యాధునిక పరిశోధ న కేంద్రంగా ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment