రొంపిచెర్ల: మండలంలో మూ డు ఆలయాల్లో హుండీలను పగలగొట్టి నగదును చోరీ చేసిన సంఘటనలు సోమవారం రా త్రి జరిగాయి. గ్రామస్తుల కథ నం మేరకు.. మోటుమల్లెల పంచాయతీలోని బి.చల్లావారిపల్లె–ఆదినవారిపల్లె గ్రామాల మధ్య లో ఉన్న ఊడగలమ్మ ఆలయంలో హుండీ పగులగొట్టి అందులోని సుమారు రూ. 50 వేలు నగదును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఆదినవారిపల్లె దళితవాడలోని మాత మ్మ ఆలయంలోని హుండీని పగులగొట్టి అందులోని డబ్బును చోరీ చేశారు. అలాగే వంకిరెడ్డిగారిపల్లెలోని బాట గంగమ్మ ఆలయంలో కూడా హుండీలో నగదు చోరీ జరిగింది. ఒకే రోజు మూడు ఆలయాల్లో చోరీలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment