బాబుకు భారత్ సేవా పురస్కారం అవార్డు
కాణిపాకం: కాణిపాకానికి చెందిన వ్యక్తిత్వ వికాస శిక్షకుడు బాబు భాతర్ సేవా పురస్కారం వరించింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ జాతీయ చైర్మన్ రాములు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అనేకమంది విద్యార్థులకు ఉచిత సాఫ్ట్‌వేర్ శిక్షణ, బెస్ట్ సోషల్ సర్వీస్ కేటగిరీలో ఆయనకు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా బాబుకు పలువురు అభినందనలు తెలిపారు.
సారా తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
చిత్తూరు అర్బన్: ద్విచక్ర వాహనంలో సారా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ పవన్‌కుమార్ తెలిపారు. వివరాలు.. గురువారం పుంగనూరు–మదనపల్లె రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తుండగా పుంగనూరు పట్లపల్లెకు చెందిన బాలాజీ నాయక్, సోమశేఖర్ నాయక్ బైక్‌లో 18 లీటర్ల సారా తరలిస్తూ పట్టుబడ్డారు. నిందితులను అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. 14 రోజుల రిమాండుకు ఆదేశించారు. దీంతో నిందితులను చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించినట్లు సీఐ పవన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment