నిత్యాన్నదానానికి 13 టన్నుల కూరగాయల వితరణ
పలమనేరు: తిరుమల, కాణిపాకంలో జరుగు తున్న నిత్యాన్నదానం పథకాలకు పలమనేరు కు చెందిన దాతలు 13 టన్నుల కూరగాయల ను వితరణ చేశారు. పలమనేరు పట్టణానికి చెందిన దాతల సాయంతో స్థానిక శ్రీవారి సేవకులు తిరుమలోని నిత్యాన్నదాన పథకానికి ప ది టన్నులు, కాణిపాకంలోని నిత్యాన్నదాన ప థకానికి 3 టన్నుల వివిధ రకాల కూరగాయల ను టటీడీ వాహనంలో సోమవారం ఇక్కడి మార్కెట్ నుంచి తరలించారు. ఈ సందర్భంగా గోవిందనామ స్మరణల నడుమ టీటీడీ ప్ర త్యేక వాహనానికి పూజలు చేశారు. నిర్వాహకులు రవి, కిశోర్, దాతలు మురళీ కాఫీవర్క్స్ శ్రీకాంత్, మంజునాథ్, శ్యామ్, వెంకటేష్, జైసింగ్, మహేంద్రలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మండీ యజమానులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
పశుగ్రాస పెంపంకానికి దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): బహు వార్షిక పశుగ్రాస పెంపకానికి దరఖాస్తులు చేసుకో వచ్చనన్ని పశుసంవర్థక జేడీ ప్రభాకర్ తెలిపారు. ఉపాధిహామీ పథకం ద్వారా ఈ పెంపకం జరుగుతుందన్నారు. 5 ఎకరాల్లోపు భూ మి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులని చె ప్పారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు ఫారంతో పాటు జాబ్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నకలతో రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు.
నిబంధనల అతిక్రమిస్తే కేసులు
చిత్తూరు అర్బన్: న్యూ ఇ యర్ సంబరాల పేరిట ని బంధనలను అతిక్రమి స్తే క్రిమినల్ కేసులు నమో దు చేస్తామని చిత్తూరు ఎ స్పీ మణికంఠ పేర్కొన్నా రు. లాడ్జీలు, ఇతర స్థలా ల్లో కార్యక్రమాలు నిర్వహించే వారు ముందు గా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. అ నుమతులు లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే చ ర్యలు తప్పవన్నారు. ఇక చిత్తూరు నగరంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు పోలీసుల తనిఖీలు కొనసాగుతాయని, మద్యం సేవించి వా హనాలు నడిపితే.. వాహనాలను సీజ్ చేసి, నిందితులను కోర్టుకు తరలిస్తామన్నారు. ఫ్లై ఓవర్లు, రోడ్లపై న్యూ ఇయర్ వేడుకలు నిషేధ మని, మద్యం బార్లు, దుకాణాలు నిర్ణీత సమయంలో మూసేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా బ్లూకోట్, రక్షక్, హైవే పట్రోల్ సిబ్బంది గస్తీ, నిఘా ఉంటుందని, ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌ రవించి, నిబంధనలు పాటిస్తే మంచిదన్నారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు వస్తే డయ ల్–112, పోలీసు వాట్సప్ 944900005 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం మంగళవారం ని ర్వహించనున్నట్లు చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం ప్రారంభమవుతుందన్నారు. అజెండాలోని అంశాలైన వ్యవసాయం, ఉద్యానవనం, విద్యా, వైద్య, గృహ నిర్మాణ, గ్రామీణ నీ టి సరఫరా, విద్యుత్, పంచాయతీరాజ్, డ్వా మా, డీఆర్‌డీఎ, అంగన్‌వాడీశాఖల పరంగా చ ర్చ జరుగుతుందన్నారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment