ఏం..తాగేశార్రాబాబూ!
మద్యం మత్తులో కొట్టుకున్నారు!
పుంగనూరు: మద్యం మత్తులో ఒకరినొకరు కొట్టుకోవడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం నేతిగుట్లపల్లెలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. మండలంలోని నేతిగుట్లపల్లెకి చెందిన మహేశ్వర్(40), గంగులప్ప ఫూటుగా మద్యం సేవించారు. ఆ మత్తులో ఘర్షణ పడ్డారు. గొడవ శృతి మించడంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో మహేశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆ ప్రాంత వాసులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కొత్త మద్యం పాలసీ.. 24 గంటలూ అందుబాటులో మద్యం.. ఆపై ఆంగ్ల నూతన సంవత్సరాది.. ఇంకేముంది.. మద్యం ప్రియులు మనసారా తాగేశారు.. ఊగిపోయారు. ఎంతగా అంటే మూడు రోజుల్లో ఏకంగా రూ.పది కోట్ల విలువైన మద్యం, బీర్లు తాగేశారు. ఇది జిల్లాలో సరికొత్త చరిత్ర.
చిత్తూరు అర్బన్: ప్రజలకు దాహమేస్తే బిందెడు నీళ్లు ఇస్తున్నారో..? లేదో గానీ.. మద్యం ప్రి యులు అడగకున్నా అర్ధరాత్రుల వరకు మద్యాన్ని అందుబాటులో ఉంచిన కూటమి ప్రభుత్వం రూ.కోట్లు కొల్లగొట్టింది. జిల్లా చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో నూతన సంవత్సరం వేళ మద్యం విక్రయాల్లో రికార్డులు బద్దలు కొట్టింది. ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా రూ.10 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో ప్రభుత్వ ఖజానా నిండింది.
రికార్డు స్థాయిలో విక్రయాలు
జిల్లాలోని ఎనిమిది ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్లలో ఈ దఫా జరిగిన మద్యం విక్రయాలు గతంలో ఎప్పుడూ జరగనంతగా రికార్డు స్థాయిలో జరిగాయి. జనవరి ఒకటో తేదీ వస్తోందంటేనే మందు బాబులకు పండుగ. ఏది ఉన్నా, లేకున్నా మద్యం మాత్రం ఉండాల్సిందేనంటూ మద్యం ప్రియులు పండుగ చేసుకున్నారు. గత మూడు రోజులుగా జిల్లాలో రూ.10 కోట్ల విలువ చేసే మద్యం తాగేశారు. రోజుకు సగటున జిల్లాలో రూ.40 లక్షల వరకు మద్యం విక్రయాలు జరిగితే.. ఇపుడు ఏకంగా రూ.కోట్లు దాటేసింది. సోమవారం (డిసెంబరు 30)న జిల్లాలోని ఎనిమిది సర్కిళ్లల్లో 6,604 బాక్సుల మద్యం, 3,002 బాక్సుల బీర్లు.. మంగళవారం (డిసెంబరు (31) 4,054 బాక్సుల మద్యం, 1,737 బాక్సుల బీర్లు చిత్తూరులోని మద్యం డిపో నుంచి దుకాణాల నిర్వాహకులు కొనుగోలు చేసి, మద్యం విక్రయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇక జనవరి ఒకటో తేదీన వెయ్యి బాక్సుల వరకు మద్యం, 800 వరకు బీరు బాక్సులు కొనుగోలు చేశారు. ఈ లెక్కన నూతన సంవత్సర నేపథ్యంలో గత మూడు రోజులుగా జిల్లాలో 11,112 బాక్సుల మద్యం, 5,541 బాక్సుల బీర్లను తాగేశారు. గతేడాది ఇదే మూడు రోజుల విక్రయాలు పరిశీలిస్తే మద్యం 8,011 బాక్సులు, బీర్లు 1,878 బాక్సులు అమ్ముడయ్యాయి. గతేడాది ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండడంతో మద్యం అమ్మకాలపై నియంత్రణ ఉండేది. ఇపుడు మొత్తం ప్రైవేటు దుకాణాలు అందుబాటులోకి రావడం, పైగా మందు బాబులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరచి ఉండడంతో ఊహించని వ్యాపారం జరిగింది.
న్యూ ఇయర్ కిక్కు రూ.10 కోట్లు!
మద్యం విక్రయాల్లో రికార్డులు బద్దలు
11 వేల బాక్సుల మద్యం.. 5500 బాక్సుల బీర్లు ఖాళీ
అర్ధరాత్రులూ మద్యం సరఫరా చేసిన సర్కారు
Comments
Please login to add a commentAdd a comment