ఎస్సీ కులగణన అభ్యంతరాలుంటే తెలపండి
చిత్తూరు కలెక్టరేట్ : ఎస్సీ కులగణనపై ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్ర భుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ వరకు ఎస్సీ కులగణన సోషల్ ఆడిట్ నిర్వహించి, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. ఎస్సీ కులగణన వివరాలను గ్రామ, వార్డు సచివాలయా ల్లో ప్రదర్శించినట్లు చెప్పారు. తుది వివరాలను ఈ నెల 17వ తేదీన ప్రదర్శించడం జరుగుతుందన్నారు. కులగణనపై మూడు దశల్లో తనిఖీలుంటాయన్నారు. పేరు, ఆధార్, పుట్టిన తేదీ, వయస్సు, ఉపకులం వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తారని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను వీఆర్వో పరిశీలించి ఆర్‌ఐకి పంపుతారన్నారు. ఆర్‌ఐ పునఃపరిశీలించి, తుది ఆమోదం తెలిపి వివరాలు భద్రపరుస్తారన్నారు. ఈ వివరాల్లో కచ్చితత్వాన్ని పెంపొందించేందుకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులతో సరాసరి 50 మంది వివరాలను తనిఖీ చేయిస్తామన్నారు. సోషల్ ఆడిట్‌ను తనతో పాటు ఆర్డీఓలు స్వయంగా పర్యవేక్షిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
అయ్యప్పస్వామి ఆలయంలో భక్తుల సందడి
సదుం: మండలంలోని ఎర్రాతివారిపల్లె అయ్యప్పస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, గంట ల తరబడి వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని ఎన్‌సీసీ విద్యార్థులు క్రమబద్ధీకరించారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యే క బస్సులు నడిపారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయాన్నికి వెళ్లే ప్రధాన రహదారి అర కిలోమీటరు మేర ట్రాఫిక్ స్తంభించింది.
షీ బాక్స్ పోర్టల్ ఏర్పాటు చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో షీ బాక్స్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు డీఈఓలను ఆదేశించారు. ఈ మేరకు ఆయన జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరాయి. పని స్థలంలో లైంగిక వేధింపుల నివారణ, ఫిర్యాదుల కోసం షీ బాక్స్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల:తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 2 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 62,495 మంది స్వామివారిని దర్శించుకున్నా రు. 19,298 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.80 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేనివారికి 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలో సర్వదర్శనం టోకె న్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూ లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment