ప్రాణం తీసిన సరదా
కుశస్థలి నదిలో ఓ విద్యార్థి గల్లంతై, మృతి చెందాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలించి మృతదేహాన్ని వెలికితీశారు.
సీఎం పర్యటన
ఏర్పాట్ల పరిశీలన
కుప్పంరూరల్: సీఎం చంద్రబాబు 5,6,7 తేదీల్లో కుప్పం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ చండోలు పరిశీలించారు. ద్రావిడ విశ్వవిద్యాలయం, సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించనున్న నడుమూరు, చీగలపల్లిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. అనంతరం హెలిప్యాడ్ ప్రదేశాలను సందర్శించి, స్థానిక అధికారులకు ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఎక్కడా లోపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాసరాజు, కడా డైరెక్టర్ వికాస్ మర్మత్, స్థానిక అధికారులు ఉన్నారు.
సౌత్‌జోన్ వాలీబాల్ టోర్నీకి పలమనేరు విద్యార్థిని
పలమనేరు: చైన్నెలో ఈ నెల 7న జరిగే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పట్టణంలోని ఎంవీఆర్ కళాశాలకు చెందిన ప్రవీణ ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీసుధా, కరస్పాండెంట్ ఎంవీఆర్ రెడ్డి తెలిపారు. పోటీల్లో వాలీబాల్ జట్టులో ఎస్వీ యూనివర్సిటీ జట్టు తరఫున పాల్గొంటుందని చెప్పారు. ఈ కళాశాలలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రవీణ వాలీబాల్‌లో మంచి ప్రతిభ కనబరిచి ఈపోటీలకు ఎంపికై ంది. ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనున్న ఎస్వీయూ జట్టులో పలమనేరు నుంచి ప్రవీణ ఎంపికై ందన్నారు. కళాశాల యాజమాన్యం ఆమెకు అభినందనలు తెలిపింది.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment