మేము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతకం అని హామీ.. అధికారంలోకి వచ్చారు. ఎట్టకేలకు ఆ ఫైలుపై తొలి సంతకం చేశారు.. గత ప్రభుత్వ నోటిఫికేషన్‌ రద్దు.. ఆపై టెట్‌ అన్నారు.. అదీ వాయిదా అన్నారు.. మళ్లీ గతంలో డీఎస్సీ కేసులపై అధ్యయనం సాకు.. ఆపై ఎస్సీ | - | Sakshi
Sakshi News home page

మేము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతకం అని హామీ.. అధికారంలోకి వచ్చారు. ఎట్టకేలకు ఆ ఫైలుపై తొలి సంతకం చేశారు.. గత ప్రభుత్వ నోటిఫికేషన్‌ రద్దు.. ఆపై టెట్‌ అన్నారు.. అదీ వాయిదా అన్నారు.. మళ్లీ గతంలో డీఎస్సీ కేసులపై అధ్యయనం సాకు.. ఆపై ఎస్సీ

Published Thu, Jan 2 2025 1:51 AM | Last Updated on Thu, Jan 2 2025 1:51 AM

మేము

మేము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతక

ఎస్సీ వర్గీకరణ నివేదిక వస్తేనే డీఎస్సీ నోటిఫికేషన్‌

గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ ను రద్దు చేసిన కూటమి సర్కార్‌

మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి మీనమేషాలు

ఇప్పటికీ మూడుసార్లు వాయిదా

పలమనేరు: డీఎస్సీ నిర్వహించకుండా కూటమి సర్కార్‌ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇప్పుడు జరుగుతున్న తంతు చూస్తుంటే వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి సైతం కొత్త ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుందన్న విషయం అనుమానంగా మారింది. పలువురు అభ్యర్థులు తాము చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు వదులుకుని రూ.వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొంది, డీఎస్సీ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటికే మూడు దపాలు డీఎస్పీ వాయిదా వేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణపై క్లారిటీ వచ్చాకే డీఎస్సీ ఉంటుందనే కొత్త మెలిక పెట్టింది.

ఉన్న కొలువులు వదులుకుని..

డీఎస్సీ వస్తుందన్న ఆశతో పలువురు తాము చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు వదులకుని, రూ.వేలకు వేలు కోచింగ్‌ సెంటర్లకు ఫీజులు కట్టి, శిక్షణ పొంది, ఖాళీగా ఉన్నారు. చాలామంది అభ్యర్థులు గతంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలో పనిచేస్తుండేవారు. మెగా డీఎస్సీలో పోస్టు కొట్టాలన్న ఆశతో ఉన్న ఉద్యోగాలను వదులుకున్నారు. డీఎస్సీ రాక, ఉన్న ఉద్యోగం లేక రోడ్డున పడి ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కోచింగ్‌ సెంటర్లే కాకుండా రాష్ట్రంలోని పలు చోట్ల మెగా డీఎస్సీ కోసం కోచింగ్‌ సెంటర్లలో ఉన్న వారి సంఖ్య ఐదు వేల మంది వరకు ఉన్నట్టు అంచనా.

వాయిదాల డీఎస్సీ

గత ప్రభుత్వ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. మెగా డీఎస్సీ అన్నారు. ఆపై టెట్‌ రాయాలన్నారు. మళ్లీ ఎస్సీ వర్గీరణపై కమిటీ నివేదిక రావాలంట. ఇదంతా చూస్తే ఇది వాయిదాల డీఎస్సీనేనా? అనిపిస్తోంది. మా పిల్లలను డీఎస్సీ కోచింగ్‌ కోసం నంద్యాలకు పంపాం. ఎన్నాళ్లని వాళ్లు కోచింగ్‌ సెంటర్‌లో ఉందేది. వాళ్లకు ఎంత ఖర్చు. ముఖ్యంగా వాళ్లు మానసిక వేదనకు గురి అవుతున్నారు.

–పుష్పరాజ్‌, ఎస్సీ టీచర్ల సంఘ మాజీ నాయకులు, పలమనేరు

గత ప్రభుత్వ నోటిఫికేషన్‌ను అమలు చేసుంటే..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే కూటమి నేతలు ఎన్నికల్లో సూపర్‌సిక్స్‌ హామీల్లో భాగంగా మెగా డీఎస్సీ అంటూ ఊదరగొట్టారు. ఆపై అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి డీఎస్సీపై మాట మార్చి దాటవేస్తున్నారు. మెగా డీఎస్సీ పేరిట 16,347 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి, ఆరు నెలలు పూర్తయినా ఇప్పటికీ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను అమలు చేసుంటే ఇప్పటికే కొత్త ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చేవారు.

కుంటిసాకులతో మెగా వాయిదా

తొలుతేమో టెట్‌ మరోసారి నిర్వహించి ఆపై డీఎస్పీ నిర్వహిస్తామని చెప్పింది. ఆపై గతంలో డీఎస్సీపై కోర్టు కేసులు పరిశీలించి, అడ్డంకులు తొలగించి, నోటిఫికేషన్‌ ఇస్తామని వాయిదా వేశారు. ఇప్పుడేమో ఎస్సీ వర్గీకరణ కమిటీ సూచనల కోసం ఎదురుచూస్తున్నామని కమిటీ నివేదిక అందాకే డీఎస్సీ ఉంటుందని మెలిక పెట్టారు. ఎస్సీ కమిషన్‌ నివేదిక వచ్చేదెపుడో? ఆపై ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించేదెపుడో? ఇదంతా సాధ్యమైయ్యేపనేనా? అని ఉపాధ్యాయ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కనీసం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీని నిర్వహించి ఎస్సీ కమిషన్‌ సూచనలు వచ్చాక ఎస్సీ అభ్యర్థులను నియమిస్తామని మిగిలిన పోస్టులునైనా భర్తీ చేసుంటే బాగుండేదని పలువురు విద్యావేత్తలు చెబుతున్నారు.

నిరుద్యోగుల జీవితాలతో ఆటలు

మెగా డీఎస్సీ అని చెప్పి రకరకాల కారణాలతో డీఎస్సీ వాయిదా వేయడం తగదు. ఇప్పటికే ప్రభు త్వ బడుల్లో టీచర్ల కొతర కారణంగా నిర్వహణ భారమైంది. దీనికితోడు విద్యావ్యవస్థలో మార్పు లు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇవన్నీ జరిగేదెప్పటికో? డీఎస్సీ పెట్టెదెపుడో? అనే అనుమానాలున్నాయి. ఏదేమైనా ఈ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది.

–సోమచంద్రారెడ్డి, యూటీఎఫ్‌ మాజీ నాయకుడు, పలమనేరు

No comments yet. Be the first to comment!
Add a comment
మేము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతక1
1/3

మేము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతక

మేము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతక2
2/3

మేము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతక

మేము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతక3
3/3

మేము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement