వన్య ప్రాణి మృతి
నాయకనేరి రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని జంతువు మృతి చెందడంతో అటవీ అధికారులు పరిశీలించారు.
●
ఆరియర్స్‌పై ఆశలు..
ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో తీపి కబురు ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం. రిటైర్డు, ప్రస్తుత ఉద్యోగులకు ప్రధానంగా ఉన్న సమస్యలు తీరాలని ఆ ఏడుకొండల వాడికి మొక్కులు చెల్లించుకుంటున్నాం. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఉద్యోగుల సాదక బాధలను పట్టించుకుని మావైపు చూడాలి. మా సమస్యలు తీరాలి. అరియర్స్ ఇవ్వాలి. పీఆరీసీ చేయాలి. ఈ ఏడాదిలో ఇదే ప్రధానమైన కోరిక.
– రాజరత్నంరెడ్డి, రిటైర్డ్ ఉద్యోగి, చిత్తూరు
పోలీస్ కొలువు కోసం..
డీగ్రీలో బీకాం కంప్యూటర్స్, బీఈడీ పూర్తి చేశా. నాకు పోలీస్ ఉద్యోగం అంటే ఇష్టం. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ పడినప్పుడు నేను దరఖాస్తు చేసుకున్నా. పరీక్షలో ఉత్తీర్ణత సాధించా. ఇక ఈనెల 9వ తేదీన దేహదారుఢ్య పరీక్ష ఉంది. ఇక్కడ నెగ్గితే, మెయిన్స్‌లోనూ సత్తా చాటుతా. నా కుటుంబంలో కొత్త కళను తీసుకొస్తా. పోలీసు కావాలనే కోరిక ఈ ఏడాది నెరవేరుతుందని భావిస్తున్నా. ఆదేవుడిపై భారం వేశా.
– రాజా, నిరుద్యోగి, తవణంపల్లి
రైతు కడుపు చల్లాగా ఉండాలి..
వర్షాలు సమృద్ధిగానే కురిశాయి. బోరు బావుల్లో నీళ్లు ఉన్నాయి. పంట పండించేందుకు రైతులకు నీటికి ఢోకాలేదు. వేసిన పంట సక్కగా దిగుబడి వస్తే చాలు. పండే పంట రైతుకు నష్టం మిగల్చకపోతే మేలు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందిస్తే రైతులు పెట్టుబడి పెట్టి పంట సాగు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం రైతు కంట కన్నీరును తుడిస్తే చాలన్నది కర్షకుల అభిప్రాయం.
– భానుప్రకాష్, చిత్తూరు మండలం
– IIలో
Comments
Please login to add a commentAdd a comment