● హోమ్‌గార్డ్, లాడ్జి మేనేజర్ మధ్య సంభాషణ ● వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న భాగోతం
వి.కోట : శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే నిందితులకు అండగా ఉంటూ ‘‘మేముండాం.. నువ్వు ఏమైనా చేసుకో.. మాకు మామూళ్లు ఇచ్చుకో.. మేం చూసుకుంటాం’’ అంటూ ఫోన్‌లో హోంగార్డ్, లాడ్జి నిర్వాహకుడి మధ్య జరిగిన సంభాషణ సోమవారం వాట్సాప్ గ్రాపుల్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. వి.కోట పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పట్టణంలోని ఓ లాడ్జి నిర్వాహకుడి మధ్య వ్యభిచార నిర్వహణ.. మామూళ్లపై సెల్‌ఫోన్‌లో జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది. ఇందులో హోంగార్డు మాట్లాడుతూ ‘మాకు ప్రతి నెలా మామూళ్లు ఇచ్చుకుని లాడ్జిలో వ్యభిచారం(బ్రోతలింగ్) నిర్వహించుకో.. మన సార్ మనకు ముందుగా సమాచారం ఇస్తాడు. రైడింగ్ జరిగితే నేను నీకు ముందుగా సమాచారం ఇస్తాను. ఎవరికీ అనుమానం రాకుండా అమ్మా యిలను తెప్పించుకో.. మిగతా విషయాలు నేను చూసుకుంటా.. నువ్వు మాకు ప్రతి నెలా మామూళ్లు ఇస్తే చాలు.. జాగ్రత్త.’ అంటూ లాడ్జి నిర్వాహకుడితో జరిపిన సంభాషణ వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment