28 నుంచి దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు
తిరుపతి కల్చరల్: వైఎస్సార్ జిల్లాలోని దేవుని కడపలోనున్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు జరగనున్నాయి. ఈమేరకు సోమవారం టీటీడీ పరిపాలనా భవనంలోని ఈఓ చాంబర్‌లో టీటీడీ ఈఓ జె.శ్యామలరావు స్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 28న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ, 29న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3న స్వామివారి కల్యాణోత్సవం చేపడతారు. రూ.300 చెల్లించి గృహస్తులు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. అలాగే ఫిబ్రవరి 7న పుష్పయాగం జరగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీ.వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ, డెప్యూటీ ఈఓలు నటేష్‌బాబు, ప్రశాంతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment