మరోసారి పింఛన్‌దారుల సర్టిఫికెట్ల పరిశీలన
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మరోసారి పింఛన్‌దారుల సదరం సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పింఛన్‌దారుల సర్టిఫికెట్లను పరిశీలించేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. జిల్లాలోని కుప్పం, నగరి, పలమనేరు, చిత్తూ రు ప్రభుత్వాస్పత్రుల్లో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు క్యాంపులు నిర్వహిస్తామన్నారు. అలాగే ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో వారంలో మూడు రోజుల చొప్పున క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్యాంపుల నిర్వహణ విషయాన్ని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ముందస్తుగా పింఛన్‌దారులకు నోటీసుల రూపంలో తెలియజేయాలన్నారు. రోజుకు 50 మందిని పరిశీలిస్తారన్నారు. డాక్టర్లు మరోసారి అంగవైకల్యాన్ని పరిశీలించి సర్టిఫికెట్లు అందజేస్తారన్నారు. క్యాంపుల షెడ్యూల్‌ను ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు పంపినట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం పింఛన్‌దార్ల్లను క్యాంపులకు తీసుకొచ్చేలా పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment