4 టేబుళ్లు, 12 కుర్చీలే పెట్టుబడిగా
నాలుగు టేబుళ్లు, 12 కుర్చీలే పెట్టుబడిగా సాగుతున్న ఈ జూదం కూటమి పార్టీలోని కొందరు నేతలకు భారీగా కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే దీన్ని అదే పార్టీలోని చాలా మంది నేతలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. చిత్తూరు హైరోడ్డులోని ఓ సిమెంటు దుకాణంలో నిర్వహిస్తున్న పేకాట వ్యవహారంపై, కూటమి పార్టీకి చెందిన బీసీ నేత తమ నాయకుడికి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపానపోలేదు. అన్నీ తెలిసినా కొందరు పోలీసు అధికారులు నెలసరి మామూళ్లు తీసుకుంటూ క్లబ్‌లకు పర్మిషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. జరుగుతున్న తంతంగం మొత్తం తెలిసినా, పోలీస్ బాస్ చెవిలో పడేయాల్సిన స్పెషల్ బ్రాంచ్ మిన్నకుండిపోవడం..ఆ విభాగానికి సైతం మరకలేమైనా అంటుకున్నాయా..? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment