సేద్యం..
ఈవెంట్స్‌కు అనుమతించండి
కానిస్టేబుల్ పోస్టుల దేహదారుఢ్య పరీక్షల (ఈ వెంట్స్)కు తను అనుమతించాలని పలువురు అభ్యర్థులు డీజీపీని కోరారు.
ఉపాధి పనుల తనిఖీ
యాదమరి మండలం కోనాపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆ పథకం డీవీఓ శివయ్య తనిఖీ చేశారు.
మంగళవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2025
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు భూపతి నాయుడు. ఈయనది పెనుమూరు మండలం ఉప్పెనపల్లి. ఈయకు ఐదు ఎకరాల పొలం ఉంది. గత ఏడాది వరకు వర్షాధారంగా వరి, వేరుశనగ పంటలు సాగు చేశారు. గత వేసవిలో రూ.10 వేలు ఖర్చు పెట్టి పొలం దుక్కులు దున్నారు. ప్రస్తుతం వర్షాధార పంటగా వేరుశనగ సాగు చేయాలని భావించారు. సకాలంలో వర్షాలు కురవక, నీటి వసతి లేక పంట సాగు మానేశారు. ప్రస్తుతం పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోవడంతో తమ కుటుంబం ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బైరెడ్డిపల్లె మండలంలో ఎండిన క్యాబేజీ పంటను మేస్తున్న గొర్రెలు
పంట సాగు చేయలేకపోతున్నాను
నాకు మూడు ఎకరాల పొలం ఉంది. అందులో వేరుశనగ సాగు చేశాను అయితే వర్షాభావ పరిస్థితులతో ఆ పంట పూర్తిగా ఎండిపోయింది. ప్రస్తుతం మళ్లీ సాగు చేయడానికి నీరు లేదు. పంట సాగుతో నష్టపోయిన మా కుటుంబానికి బతుకుదెరువు కష్టంగా మారింది. మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి.
– బాబు, చిన్నతయ్యూరు గ్రామం,
ఎస్‌ఆర్‌పురం మండలం
నీటిని తోలినా ఫలితం లేదు
నాకు 2.5 ఎకరాల భూమి ఉంది. వర్షం కురుస్తుందన్న ఆశతో ప్రభుత్వం అందించే రాయితీ వేరుశనగ విత్తనాలు తీసుకుని, దుక్కి దున్ని పంట సాగు చేశాను. తీరా చూస్తే వర్షం ముఖం చాటేసింది. నా వేరుశనగ పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి పిచికారి మందులు, ట్యాంకర్లతో నీటిని తోలి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నించాను. అయినా నా ప్రయత్నం ఫలించలేదు. పంట మొత్తం ఎండిపోయి నాశనం అయిపోయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– చెంగల్‌రాయులు, పెద్దతయ్యూరు,
ఎస్‌ఆర్‌పురం మండలం
చివరకు అప్పులే మిగిలాయి
నాకున్న కొంత భూమిలో వేరుశనగ పంట సాగు చేశా. నీరు సరిపోదనే ఉద్దేశంతో ట్యాంకర్లతో తోలించాను. అందుకోసం రూ.50 వేల వరకు ఖర్చు చేశాను. ఎంత ఖర్చు చేసినా పంట మాత్రం చేతికందలేదు. ఇన్నాళ్లూ నేను చేసిన కష్టమంతా మట్టిపాలైంది. చివరకు అప్పులే మిగిలాయి.
– రెడ్డెప్ప, రైతు, గుడిపాల మండలం
ప్రభుత్వమే ఆదుకోవాలి
కరువుతో పంట నష్టం జరిగిన రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి. పంటలు కోల్పోయిన రైతాంగం ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇటీవల కురిసిన వాన అంత ప్రయోజనమేమి కల్పించలేదు. దీంతో పంటలంతా ఎండిపోయాయి. కనీసం పశువులకు మేత కూడా దొరకడం లేదు. పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలైంది.
– శ్రీనివాసులు, రైతు,
దాసెగానూరు, కుప్పం
వరుణుడు కన్నెర్ర చేశాడు.. అన్నదాతపై పగ పట్టాడు.. ఈ ఏడాది అలకబూనాడు.. పంటలన్నీ ఎండిపోయాయి.. రబీ సీజన్‌లో సాగు సాగక చేలన్నీ బీళ్లుగా మారాయి.. కాడీ, మేడీ మూలకు చేరాయి.. పల్లెలన్నీ బోసిపోయాయి.. అన్నదాత కళ్లలో కన్నీళ్లువొలుకుతున్నాయి.. జిల్లాలో ఏ గ్రామంలో చూసినా ఇవే దృశ్యాలు.. ఏ ఇంట రైతును కదిపినా ఈ కన్నీటి వెతలే వినిపిస్తున్నాయి.. ప్రభుత్వ పెట్టుబడి సాయం అందక, సాగుకు చేసిన అప్పులు తీరే దారేదని రోదిస్తున్నాయి.. పంటలు పండక.. పిల్లలను చదివించలేక..కుటుంబాలను పోషించలేక.. బతికేదెలా.. అని దిక్కులు చూస్తున్నాయి. ఇదీ చిత్తూరు జిల్లా కన్నీటి కథ.
చిత్తూరు కలెక్టరేట్ : ఎండిపోయిన పైర్లు.. బీళ్లుగా మారిన పొలాలు.. కబేళాలకు తరలుతున్న పశువులు, వలస బాట పట్టిన రైతన్నలు. జిల్లాల్లోని ప లు గ్రామాల్లో ఇలాంటి హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. అన్నదాతలు కరువు కాటుకు చిక్కి విలవిల్లాడుతున్నారు. పంటల సాగు కోసం చేసిన అప్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతటి కరువును తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని రైతులు బోరుమంటున్నారు. దుర్భిక్షం దాటికి పంటలు ఎండిపోయి, దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్న తమను ప్రభుత్వం సైతం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంట చేతికి రాక, ఉన్న ఊళ్లో బతుకుదెరువు లేక పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు.
నెర్రిలిచ్చిన పొలాలు..
పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన పంట భూములు కరువు ధాటికి బీళ్లుగా మారాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలు పండించేందుకు తేమ నీరు లేక రైతులు మిన్నకుండి పోయారు. టమాట, మిరప, బెండ తదితర కూరగాయల తోటలు సైతం చేతికి రాకుండా పోయాయి. అప్పులు చేసి సాగు చేసిన పంటలు కరువు కాటుకు మట్టిలోనే కలిసి పోవడంతో రైతన్నలు కుమిలిపోతున్నారు. చేసిన అప్పులు భయపెడుతున్నాయి. కరువు మండలాల్లో చాలాచోట్ల తాగడానికి నీరు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. దుర్భిక్షంతో మేత, నీరు సమకూర్చడం కష్టం కావడంతో చాలామంది రైతులు విధిలేని పరిస్థితుల్లో పశువులను కారు చౌకగా కబేళాలకు విక్రయిస్తున్నారు. జిల్లా నుంచి సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు లారీల్లో కళేబరాలకు తరలించేస్తున్నారు. కరువు మండలాల్లోని ఎంతోమంది అన్నదాతలు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ఎండిన పైర్లు..బీళ్లుగా పొలాలు
జిల్లాలో మూడు మండలాల్లోనే
తీవ్ర కరువు
మిగిలిన 13 మండలాల్లో
మధ్యస్థ కరువు
కరువు మండలాలను పట్టించుకోని కూటమి
వట్టిపోతున్న బోర్లు..
జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం పెనుమూరు, పూతలపట్టు నియోజకవర్గం యాదమరి, చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలాల్లోని చాలా వరకు గ్రామాల్లో అతి తక్కువ వర్షపాతం కురవడంతో బోర్లు ఎండిపోతున్నాయి. ఆ మూడు మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ఇటీవల ప్రకటించింది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షం కురిసింది. అయితే ఆ కొద్దిపాటి వర్షంతో ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు పంటలు ఎండిపోయాయని ఆ మూడు మండలాల రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. దిగుబడి చాలా వరకు తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాధారంగా సాగు చేసిన పంటలే కాకుండా బోర్ల కింద సాగు చేసిన పైర్లు కూడా ఎండిపోతున్నాయి. భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయిందని మూడు మండలాల రైతులు వెల్లడిస్తున్నారు.
అడుగంటిన భూగర్భ జలాలు
ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగా కురువకపోవడం, అరకొర వర్షాలతో చాలా బోరుబావులు ఎండిపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో పంట సాగు చేయలేక రైతులు అలమటిస్తున్నారు. అడపాదడపా వచ్చిన వాన నీళ్లు ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకిపోయాయి. నదులు పారలేదు. నీటి చుక్క కనిపించలేదు. గత జూన్‌లో కురిసిన తేలికపాటి వర్షాలకు పంటలు సాగు చేశారు. నీటి సౌకర్యం సరిగ్గా లేక, సమయానికి వర్షాలు కురవకపోవడంతో పంటలు చేతికందక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు.
మూడంటే మూడే కరువు మండలాలు
మూడంటే మూడు మండలాలనే చంద్రబాబు సర్కార్ కరువు జాబితాలో చేర్చడంతో రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో 13 మండలాల్లో మధ్యస్థ కరువుగా ప్రకటించడంతో మిగిలిన మండలాల్లో కరువు కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. చాలా మండలాల్లో కరువు తాండవిస్తున్నప్పటికీ చంద్రబాబునాయుడు మూడు మండలాల్లో మాత్రమే తీవ్ర కరువు ఉందని గత ఏడాది నవంబర్‌లో ప్రకటించడం చాలా దారుణమని రైతులు మండిపడుతున్నారు.
ఉపాధి కోసం ఊరు వదిలి..
జిల్లాలోని చాలా మండలాల్లో రైతులు పంటలు పండించుకునేందుకు అవకాశం లేక ఉపాధి కోసం ఊర్లు వదిలి వెళ్లి పోతున్నారు. తీవ్ర కరువు, మధ్యస్థ కరువు ఉన్న మండలాల్లోని రైతులు, రైతు కూలీలుగా మారుతున్నారు. పొట్టచేత పట్టుకుని పొట్టకూటి కోసం సమీపంలోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలివెళ్లిపోతున్నారు. వలస వెళ్ల లేని వారు గ్రామాల్లో రచ్చబండలు, గ్రామ చావిళ్ల వద్ద కూర్చుని మథన పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment