మామిడి రైతులు ఆచితూచి వ్యవహరించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రైతులు మామిడి పూత విషయంలో ఆచితూచి వ్యవహరించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి అన్నారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా మామిడి పంటకు హాని కలుగుతుందన్నారు. నాలుగు రోజుల పాటు మామిడికి ఎండ తగిలితే పూత పుంజుకునే అవకాశం ఉందన్నారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల పూత వచ్చిందన్నారు. ఆ పూతకు తేనేమంచు, బూడిద తెగుళ్లు ఆశించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారుల సూచనల మేరకు మందులు పిచికారి చేసుకోవాలన్నారు. క్లోరోపైరిపాస్ 2ఎంఎల్‌కు లీటర్ నీరు, వేపనూనె 2 మి.లీకు లీటర్‌నీరు, మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటితో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. ఇలా చేస్తే పంటను తెగుళ్ల నుంచి కాపాడుకోవచ్చన్నారు. అలాగే పూత రాలేదని ఇష్టానుసారంగా మందులు పిచికారి చేయవద్దన్నారు. పూత వచ్చిన వారు పిందె రాలిపోకుండా మందులు పిచికారి చేసుకోవాలని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment