పోలీసు గ్రీవెన్స్‌కు 66 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో 66 వినతులు అందాయి. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్‌రాజు ఏఆర్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇందులో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడా రు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యపై విచారణ జరిపి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు.
పశు ఆరోగ్య పరిరక్షణకే శిబిరాలు
చిత్తూరు కలెక్టరేట్ : పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఉచిత పశు ఆరోగ్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జిల్లాలో ఈ నెల 20వ తేదీ నుంచి ఉచిత పశు ఆరోగ్యశిబిరాలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు జరిగే ఈ శిబిరాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. పశువుల ఆరోగ్యానికి, ఉత్పాదకతను పెంచడానికి, వ్యాధులను నియంత్రించడానికి, పశుపోషణ ఖర్చులు తగ్గించేందుకు ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచిత పశు ఆరోగ్య శిబిరాల్లో పశు వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు చేయించి, ఉచితంగా వైద్యం అందిస్తారన్నారు. తేలికపాటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారన్నారు. ఎదకు రాని, చూలు కట్టని, ఇతర గర్భకోశవ్యాధులకు పరీక్షలు నిర్వహించి, తగు వైద్యం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, డీఆర్వో మోహన్‌కుమార్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవానికి
పకడ్బందీ ఏర్పాట్లు
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ భావం ఉట్టిపడేలా గణతంత్ర దినోత్సవానికి ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని డీఆర్వో మోహన్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం పూర్తి సమన్వయం బాధ్యలను చిత్తూరు ఆర్డీఓ, ప్రోటోకాల్, సీటింగ్ ఏర్పాట్లు, ఆహ్వాన పత్రికల ముద్రణ పంపిణీ విధులు చిత్తూరు తహసీల్దార్ చూసుకోవాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, స్టేజీ డెకరేషన్ విధులు పోలీస్ శాఖ, సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యత డీఈఓ పర్యవేక్షించాలన్నారు. ఆస్తుల పంపిణీ కార్యక్రమం డీఆర్‌డీఏ పీడీ, అత్యవసర వైద్య సేవలను డీఎంఅండ్‌హెచ్‌ఓ, పారిశుద్ధ్యం, నీటి సరఫరా విధులను చిత్తూరు మున్సిపల్ కమిషనర్, అగ్నిమాపక వాహనాల ఏర్పాట్లను జిల్లా అగ్నిమాపకశాఖ చేపట్టాలన్నారు. స్టాల్స్ ఏర్పాటును వ్యవసాయ శాఖ జేడీ, సమగ్ర శిక్ష ఏపీసీ, హౌసింగ్ పీడీ, డీఆర్‌డీఏ పీడీ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ, విస్తృత ప్రచార ఏర్పాట్లు, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ సమాచార శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ఏర్పా ట్లు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అడిషన ల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు రవి కుమార్, శ్రీదేవి, డీఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, హౌసింగ్ ఇన్‌చార్జ్ పీడీ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment