ప్రియురాలిని చంపిన ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. ఆ తర్వాత | Food Delivery Boy Eliminated Girlfriend Attempts End Life Bengaluru | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని చంపిన ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. ఆ తర్వాత

Published Tue, Apr 6 2021 7:55 AM | Last Updated on Tue, Apr 6 2021 9:08 AM

Food Delivery Boy Eliminated Girlfriend Attempts End Life Bengaluru - Sakshi

హత్యకు గురైన యువతితో రాజు(ఫైల్‌ ఫొటో)

బొమ్మనహళ్లి: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. మనస్పర్థలు కారణంగా ప్రియురాలిని ప్రియుడు అతి దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరులోని సామసంద్రపాళ్యలో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసుల వివరాల మేరకు... సామసంద్రపాళ్యకు చెందిన సహానా (17), నగరంలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేసే రాజు (25)లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆదివారం ఉదయం రాజు సహానాను సామసంద్రపాళ్యలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ప్రేమ విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది.

సహనం కోల్పోయిన రాజు సహానాను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి మల్లేశ్వరం నుంచి యశ్వంతపుర వైపు వెళ్లే రైలెక్కాడు. పరుగులు తీస్తున్న రైలు నుంచి కిందకు దూకేశాడు. తోటి ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్షతగాత్రుడిని నిమ్హాన్స్‌ ఆస్పత్రికి తరలించారు. రాజు విషయం తెలుసుకున్న సహానా తల్లిదండ్రులు అనుమానంతో ఇంటికి వచ్చి చూడగా సహానా రక్తపు మడుగులో పడిఉంది. హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.    

చదవండి: కాళ్లపారాణి ఆరకముందే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement