సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ సస్పెన్షన్
ముమ్మిడివరం: ముమ్మిడివరం డీఎంఅండ్ హెచ్‌ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీధర్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు డీఎంఅండ్ హెచ్‌ఓ కార్యాలయానికి గురువారం సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖ ఆర్జేడీ పద్మజ నుంచి ఉత్తర్వులు అందాయని డీఎంఅండ్ హెచ్‌ఓ డి.దుర్గారావు దొర తెలిపారు. డీఎంఅండ్ హెచ్‌ఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై సామాజిక మాధ్యమాలలో వార్తలు వెలువెత్తడాన్ని ‘సాఽక్షి’ దినపత్రికలో ‘ఆరోగ్య శాఖలో అవినీతి జబ్బు’ అనే శీర్షికన ఇచ్చిన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు విచారణకు ఆదేశించడంతో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి బీవీవీ సత్యనారాయణ దశలవారీగా శాఖపరమైన విచారణ చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని సీహెచ్‌సీ వైద్యాధికారులు, నర్సులు, సిబ్బందిని విచారించి ప్రశ్నావళిలో లిఖిత పూర్వక వివరణ తీసుకుని పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. నివేదిక ఆధారంగా సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ పద్మజ ఉత్తర్వులు జారీ చేశారు.
రైల్వే శాఖకు
భూములు అప్పగించాలి
అమలాపురం రూరల్: కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అలైన్‌మెంట్ ప్రతిపాదనల ప్రకారం ఇప్పటికే సేకరించిన భూములను స్వాధీన పరుచుకుని రైల్వే శాఖకు అప్పగించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. గురువారం రెవెన్యూ అధికారులతో రైల్వే లైన్ అలైన్‌మెంట్ భూముల స్వాధీనం, అవార్డులు పాస్, భూ నష్టపరిహారాలు చెల్లింపు తదితర పెండింగ్ అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ సమస్యలను అధిగమించే ప్రయత్నంతో పాటుగా భూముల సేకరణకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఇన్‌చార్జి డీఆర్‌ఓ కె.మాధవి, రెవెన్యూ డివిజనల్ అధికారులు డి.అఖిల పి.శ్రీకర్, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ఈ సీహెచ్‌ఎన్వీ కృష్ణారెడ్డి, అయినవిల్లి తహసీల్దార్ నాగలఓఇ్మ, డీటీ ఏసుబాబు పాల్గొన్నారు.
రేపు జిల్లా స్థాయి
సైన్సు ప్రదర్శన
పి.గన్నవరం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సైన్స్ మేనేజర్ జీవీ సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం డీఎస్‌వీ ప్రసాద్ అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి సైన్సు ఫెయిర్ కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమం నిర్వహణ, విద్యార్థులకు సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కొత్తపేట ఎంఈఓ హరిప్రసాద్ పాల్గొన్నారు.
9న జాబ్‌మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 9న అమర్‌రాజా గ్రూప్ కంపెనీ ఆధ్వర్యాన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వేణుగోపాలవర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో వివిధ ట్రేడ్‌లలో ఉత్తీర్ణులై, ఎన్‌టీసీ సర్టిఫికెట్ కలిగిన వారు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.21 వేల వేతనం చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో ఆ రోజు ఉదయం 9 గంటలకు కళాశాలకు హాజరు కావాలని, వివరాలకు 86392 30775 నంబరులో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment