పథకాన్ని కొనసాగించాలి
ప్రతీ పేదవాడు ఉన్నత వైద్యం కోసం ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ పథకం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల పాలిట సంజీవనిగా ఆరోగ్యశ్రీని తీసుకునివచ్చారు. నాటి నుంచి నేటి వరకు పేద వర్గానికి చెందిన ప్రతి రోగికి ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ పథకాన్ని కొనసాగించకపోతే కార్పొరేట్ హాస్పిటల్‌లో వైద్య సేవలు పొందడం పేదలకు సాధ్యం కాదు.
– మహ్మద్ రఫీ, రాష్ట్ర ఆర్‌ఎంపీ, పీఎంపీ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, అంబాజీపేట
సామాన్యుడికి ఉచిత వైద్యం అందదు
ఎన్టీఆర్ వైద్యసేవ స్థానంలో ఇన్సూరెన్స్ కంపెనీ వస్తే సామాన్యుడికి ప్రభుత్వ వైద్యం ఎలా అందుతుంది? ఇప్పుడున్నట్టు కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతిదానికి సర్టిఫికేషన్ కావాలి అంటారు. సంబంధిత పత్రాలు లభించక పేద, మధ్య తరగతి వారు ఇబ్బంది పడతారు. ఈ విధానంలో సామాన్యుడికి ఉచిత వైద్యం అందకుండా పోతుంది. ఎన్టీఆర్ వైద్య సేవలను ఎటువంటి మార్పులు చేయకుండా కొనసాగించాలి.
– బొడ్డపాటి సురేష్, న్యాయవాది, చెల్లూరు, రాయవరం మండలం
పేదలకు మేలు చేసేలా కొనసాగించాలి
ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) అనేది పేద మధ్య తరగతి ప్రజలకు వరం లాంటిది. వైద్యం వ్యాపారంగా మారినా పేదలకు, మధ్య తరగతి వారికి మెరుగైన వైద్యం అదుతోందంటే ఈ పథకమే కారణం. ఆ పథకానికి మినహాయింపులు, కోతలు, ఎత్తివేత ఆలోచనలను ఏ ప్రభుత్వమూ చేయకూడదు. సరిపడా ఆర్థిక వనరులను సమకూర్చడంతోపాటు మరిన్ని వైద్య సేవలు పెంచాలి.
– బేతిరెడ్డి పల్లారెడ్డి, ప్రైవేట్ ఎంప్లాయిస్ ప్రతినిధి, ఊబలంక, రావులపాలెం మండలం
Comments
Please login to add a commentAdd a comment