ఎన్టీఆర్ వైద్యసేవ ఎత్తి వేసేందుకు అడుగులు
ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ఎత్తి వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. దీని స్థానంలో హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరడంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇన్నాళ్లూ జనం ఆధార్, ఆరోగ్య శ్రీ కార్డు చూపించి రూ.లక్షల వైద్యం ఉచితంగా పొందారు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తే మూడొంతులకు పైగా సేవలు నిలిచిపోయే ప్రమాదముంది. పైగా సొమ్ము చెల్లించే విషయంలో బాధితులను ముప్పుతిప్పలు పెట్టే అవకాశముందని సామాన్యులు, పేదలు భయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment