నూతన ఉత్పాదనల విడుదల
రాజమహేంద్రవరం సిటీ: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాట్కో క్రాప్ హెల్త్ సైన్సెస్ కంపెనీ అధునాతన సాంకేతిక పరిశోధనతో రూపొందించిన నూతన ఉత్పాదనలు మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ చెబియం తెలిపారు. మంగళవారం స్థానిక హోటల్ మంజీరాలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్లాంజ్, బోస్నెట్ శిలీంధ్ర నాశినులు (తెగుళ్ల మందు), నాటి నెక్ట్స్ కీటకనాశిని (పురుగుల మందు)ను మార్కెట్లోకి విడుదల చేశారు. రాజేష్ చెబియం మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రముఖ కంపెనీగా పేరొందిన నాట్ కో వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, పర్యావరణ స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ పంట ఉత్పాదికతను పెంచడానికి కట్టుబడి ఉందన్నారు. సేల్స్ మార్కెటింగ్ హెడ్ (ఇండియా) సార నర్సయ్య మాట్లాడుతూ మొదటి ఉత్పాదనైన ‘గ్లాంజ్‘ తెగుళ్ల మందు వరిలో మానిపండు తెగులు, కాటుక తెగులు, గోధుమ రంగు మచ్చ తెగులు నివారణకు, టమాటాలో వచ్చే ఆకుమాడు తెగులు నివారణకు, మినుములో సెర్కోస్పెరా మచ్చ తెగులు నివారణకు, మిరపలో బూడిద తెగులు, ఆలనేరియా ఆకుమచ్చ తెగులు, పాక్షికన్ను తెగులు నివారణకు, ప్రత్తిలో ఆల్టనేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు. రెండో ఉత్పాదనైన బోస్నెట్ వివిధ పంటలలో బూడిద తెగులు, మచ్చల తెగుళ్లను నివారిస్తుందన్నారు. మూడో ఉత్పాదనైన నాటె నెక్ట్స్ వివిధ పంటలలో కాయతొలుచు పురుగు, నల్లి (కింద ముడత)ను నివారిస్తుందన్నారు. రామిశెట్టి మాలకొండయ్య (సౌత్ సేల్స్ మార్కెటింగ్), గోపు అజయ్‌రెడ్డి (ఏపీ సేల్స్ మార్కెటింగ్) పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment