రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలలో
3 బంగారు పతకాలు సాధించిన నాగబాబు
కరప: కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన 44వ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2024 పోటీలలో కరప సబ్ యూనిట్ మలేరియా అధికారి యాతం నాగబాబు ప్రతిభ చూపి మూడు బంగారు పతకాలు సాధించాడు. గుడివాడలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ స్టేడియం క్రీడామైదానంలో ఈ నెల 14, 15 తేదీల్లో పరుగు పందేలు జరిగాయి. కరప పీహెచ్‌సీలో మంగళవారం ఆయన స్ధానిక విలేకరులకు తెలిపారు. 200, 400, 800 మీటర్ల పరుగు పంగేలలో పాల్గొని మూడింటిలో కూడా ప్రధమస్ధానంలో నిలిచి మూడు బంగారు పతకాలు సాధించానన్నాడు. 2025 ఫిబ్రవరి నెల 6 నుంచి 8వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని ఆళ్వార్‌లో జరిగే 44వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికై నట్టు నాగబాబు తెలిపారు. కాకినాడ జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ కార్యాలయంలో మలేరియా విభాగంలో సబ్‌యూనిట్ అధికారిగా, కరప సబ్‌యూనిట్ మలేరియా అధికారిగా కూడా పనిచేస్తున్న నాగబాబు 2013 సంవత్సరం నుంచి ఇప్పటివరకు రాష్ట్ర, జాతీయ, జిల్లా స్థాయిలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ పరుగు పందేలలో ఓపెన్ మీట్‌లో 100, 200, 400, 800, 1,500 మీటర్ల , రిలే పరుగు పందెంలో పాల్గొని ఇప్పటివరకు 60 పతకాలు సాధించానన్నారు. ఇందులో 15 బంగారు, 19 వెండి, 26 కాంస్య పతకాలు ఉన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment