29 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
పి.గన్నవరం: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని సోమవారం అర్ధరాత్రి పి.గన్నవరంలో ఎస్సై బి.శివకృష్ణ పట్టుకున్నారు. అందులో ఉన్న 29 కింటాళ్ల బియ్యంతో పాటు, వాహనాన్ని సీజ్ చేశారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజోలు మండలం తాటిపాక గ్రామం నుంచి బియ్యం బస్తాలతో రావులపాలెం వైపు వెళ్తున్న వాహనాన్ని స్థానిక గంటి రోడ్డులో పట్టుకున్నారు. అందులో పీడీఎఫ్ బియ్యం ఉన్నట్టు గుర్తించి స్టేషన్‌కు తరలించారు. సీజ్ చేసిన బియ్యం విలువ రూ.1,16,000 ఉంటుందని ఎస్సై తెలిపారు. ఆ బియ్యాన్ని ఎంఎస్‌ఓ ఎండీ నాగ పూర్ణిమకు అప్పగించారు. అనకాపల్లికి చెందిన వాహన యజమాని ఎస్.కొండబాబు, మగటపల్లికి చెందిన కేకేఎస్ మణికంఠలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment