దింపు కార్మికుడి మృతి
ముమ్మిడివరం: మండలంలోని చినకొత్తలంకకు చెందిన దింపు కార్మికుడు కొబ్బరి చెట్టు పైనుంచి జారి పడి మృతిచెందాడు. గ్రామా నికి చెందిన కముజు వెంకటరావు(59) గురువారం అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో దింపు తీస్తుండగా ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి జారి పడిపోవడంతో తలకు, వెన్నుపూసకు బలమైన గాయాలయ్యాయి. గాయపడిన వెంకటరావును 108 అంబులెన్స్‌లో అమలాపురం ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. మృతునికి భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment