నన్నయలో చైల్డ్ సైకాలజీ కోర్సు
ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య శ్రీనివాసరావు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో డిపార్టుమెంట్ ఆఫ్ సైకాలజీ ఆధ్వర్యంలో చైల్డ్ అండ్ అడాలసెంట్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ పీజీ డిప్లమా కోర్సును ఆసక్తి ఉన్నవారంతా సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య వై. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ కోర్సుకు సంబంధించిన బ్రోచర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇంతవరకు రెండు బ్యాచ్‌లు పూర్తయ్యాయని, ప్రస్తుతం మూడో బ్యాచ్ కోసం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయన్నారు. ఏడాది కాలపరిమితితో కూడిన ఈ కోర్సులో 40 సీట్లు ఉన్నాయని, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏ ఇతర యూనివర్సిటీలోనూ ఈ కోర్సు లేదన్నారు. ఈ కారణంగా మంచి డిమాండ్‌తో నడుస్తున్న ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు వచ్చే నెలలోగా దరఖాస్తు చేసుకుని, 22న జరిగే కౌన్సెలింగ్‌కి హాజరుకావొచ్చన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులన్నారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చని, లేకుంటే 92462 87989కి ఫోన్ చేయవచ్చునని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి. సుధాకర్, ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.విజయనిర్మల, డీన్ ఆచార్య కేవీ స్వామి, కోఆర్డినేటర్ డాక్టర్ నక్కిన నారాయణ, డాక్టర్ పడాల రాజశేఖర్, డాక్టర్ సీహెచ్ భవానీ పాల్గొన్నారు.
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్తకొబ్బరి (క్వింటాల్) 12,000 – 12,500
కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000
కురిడీ కొబ్బరి (పాతవి)
గండేరా (వెయ్యి) 17,500
గటగట (వెయ్యి) 16,000
కురిడీ కొబ్బరి (కొత్తవి)
గండేరా (వెయ్యి) 16,500
గటగట (వెయ్యి) 15,000
నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి)
13,000 – 14,000
కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 10,000 – 11,000
కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750
ఒక కిలో 260
Comments
Please login to add a commentAdd a comment