విశాఖకు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ | - | Sakshi
Sakshi News home page

విశాఖకు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌

Published Sat, Dec 21 2024 3:26 AM | Last Updated on Sat, Dec 21 2024 3:26 AM

విశాఖ

విశాఖకు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌

వృద్ధురాలి సజీవ దహనం?

సామర్లకోట: స్థానిక 27వ వార్డులో శుక్రవారం ఒక వృద్ధురాలు విక్రం అచ్చియ్యమ్మ (90) సజీవ దహనం అయినట్టు తెలిసింది. వృద్ధురాలి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. మధ్యాహ్నం భోజనం చేశాక చుట్ట కాలుస్తూ మంచంపై నిద్రించడంతో సజీవ దహనం అయినట్టు కొందరు చెబుతున్నారు. టీ కాస్తుండగా అదుపు తప్పి పొయ్యిలో పడిపోవడంతో సజీవ దహనం అయిందని మరికొందరు అంటున్నారు. ఇంటిలో నుంచి పొగ రావడంతో స్థానికులు వెళ్లి చూడగా మంచం కింద వృద్ధురాలి మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలిసిన ఆమె బంధువులు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

ముగిసిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలు

పిఠాపురం: రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ విశాఖపట్నం జిల్లా సాధించింది. ఈ నెల 19, 20 తేదీల్లో పిఠాపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ మెన్‌ బాక్సింగ్‌ పోటీలో విశాఖపట్నం మొదటి స్థానంలో, శ్రీకాకుళం జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. ఈ పోటీల్లో 10 మంది బాక్సర్లు స్వర్ణ పథకాలు సాధించారు. ఈ బాక్సర్స్‌ జనవరి 6 నుంచి 14వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరగనున్న జాతీయస్థాయి మెన్‌ బాక్సింగ్‌ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి పాల్గొంటారని ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.లక్ష్మణరావు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ జిల్లా స్పోర్ట్సు డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ బి.శ్రీనివాస్‌కుమార్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత డాక్టర్‌ ఐ వెంకటేశ్వరరావు, ఏపీ బాక్సింగ్‌ అసోసియేషన్‌ సెక్రటరీ బీఏ లక్ష్మణ్‌ దేవ్‌ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కౌన్సిలర్‌ రాయుడు శ్రీనివాసరావు, అలవరపు నగేష్‌, కేతవరపుకృష్ణ, ఆర్‌ఆర్బీ హెచ్‌ఆర్‌ హైస్కూల్‌ వైస్‌ చైర్మన్‌ సూర్యవతి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విశాఖకు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ 1
1/1

విశాఖకు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement