టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): క్రీడాస్ఫూర్తితో పోటీల్లో రాణించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరావు (నానాజీ) పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సురేష్ నగరంలోని శ్రీప్రకాష్ స్కూల్‌లో రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘ అధ్యక్షుడు భాస్కర్‌రాం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడారు. టేబుల్ టెన్నిస్ జాతీయస్థాయి ఆటగాడు, కోచ్ భీష్మ పితామహా బిరుదు గ్రహీత ముక్కామల ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు 12 జిల్లాల నుంచి 230 మంది హాజరయ్యారు. అనంతరం అతిథిలు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఏపీ టేబుల్ టెన్నిస్ సంఘ గౌరవ అధ్యక్షుడు రావు చిన్నారావు, కార్యదర్శి విశ్వనాఽథ, శ్రీప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ విజయప్రకాష్, బీవీ కృష్ణారావు, సీపోర్ట్సు సీఈఓ మురళీధర్, జిల్లా టేబుల్‌టెన్నిస్ సంఽఘ కార్యదర్శి మోహన్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment