జననేతకు జేజేలు
ఫ ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
ఫ జిల్లావ్యాప్తంగా కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు
ఫ విస్తృతంగా సేవా కార్యక్రమాలు
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు.. సంక్షేమ ప్రదాత.. పేదల బాంధవుడు.. విద్యార్థులకు మావయ్య.. పింఛనర్లకు పెద్ద కొడుకుగా.. రాజకీయాల్లో సమున్నత విలువలకు పెద్దపీట వేసిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు జననేత జన్మదినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సేవా కార్యక్రమాలతో మానవత్వం చాటుకున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజమహేంద్రవరం పార్లమెంటరీ
కార్యాలయంలో..
మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో మానవీయ దృక్పథంతో పాలన సాగించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం రూరల్
బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, రూరల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యాన జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, పార్టీ శ్రేణులకు తినిపించారు. పార్టీ పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పాల్గొన్నారు. బొమ్మూరులోని వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అనసూరి పద్మలత రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు, దుప్పట్లు పంపిణీ చేశారు.
రాజానగరంలో..
రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యాన పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌తో కలిసి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. రాజానగరం మండలం కొత్తతుంగపాడు గ్రామంలో సర్పంచ్ కొలపాటి వెంకన్న ఆధ్వరంలో కేక్ కట్ చేశారు. రాధేయపాలెంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. శ్రీరంగపట్నం, కోటికేశవరం, చినకొండేపూడి గ్రామాల్లో సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించారు.
కొవ్వూరులో..
నియోజకవర్గవ్యాప్తంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యాన పలు ప్రా ంతాల్లో కేక్‌లు కట్ చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
అనపర్తిలో..
వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి బిక్కవోలు పీహెచ్‌సీ వద్ద రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు. వైఎస్ జగన్ చేసిన మంచిని కొనియాడారు.
గోపాలపురంలో..
నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దేవరపల్లి మండలం యర్నగూడెలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి తానేటి వనిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. కృష్ణంపాలెం వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
నిడదవోలులో..
వైఎస్సార్ సీపీ పట్టణ కార్యదర్శి గాజుల రంగారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ యలగడ బాలరాజు ఆధ్వర్యాన మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు కేక్‌లు కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో రోగులకు భోజనాలు ఏర్పాటు చేశారు.
మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యాన..
మనసున్న వైఎస్ జగన్ ప్రజలకు ఎంతో మంచి చేసే వ్యక్తి అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. స్థానిక వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్‌లో మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. జగన్ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే ప్రజలకు మరింత మంచి జరిగేదన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కేక్ కట్ చేయించారు. శ్రీహ్యాపీ బర్త్ డే టూ జగనన్నశ్రీ అని అందరూ నినదించారు. అనంతరం వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. మార్గాని భరత్‌రామ్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు క్రికెట్ ఆడి, ఉత్సాహపరిచారు.
రాజమహేంద్రవరంలో రక్తదానం
రాజమహేంద్రవరం సంహిత కన్వెన్షన్ హాలులో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యాన రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ తదితరులు స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, పేదరికాన్ని తొలగించేందుకు, పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించేందుకే వైఎస్సార్ సీపీ ఆవిర్భవించిందని అన్నారు. అధినేత జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసి, అధికార, ప్రతిపక్షాల నుంచి ఇబ్బందులు, కేసులు ఎదుర్కొని, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు.
జక్కంపూడి రాజా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లేందుకే జగన్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. పేదలను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లేందుకు జగన్ ప్రతి అడుగూ వేశారన్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి, రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీని విజయపథంలో నడిపిస్తారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment